Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్ కి జరిగిన సర్జరీ ఇదే... దానికి ఎన్ని లక్షల...

Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్ కి జరిగిన సర్జరీ ఇదే… దానికి ఎన్ని లక్షల ఖర్చు అయిందంటే…

Pawan Kalyan Surgery: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు తనను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయ రంగంలో కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా ఒక సర్జరీ జరిగింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే […]

Pawan Kalyan Surgery: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు తనను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయ రంగంలో కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా ఒక సర్జరీ జరిగింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి… పవన్ కళ్యాణ్ సన్నిహితులు సైతం ఈ విషయం మీద స్పందించి నిజంగానే అతనికి సర్జరీ జరిగిందనే విషయాన్ని తెలియజేశారు…

ఇంతకీ అతనికి జరిగిన సర్జరీ ఏంటి అనే విషయాన్ని ఎవరు బయట పెట్టడం లేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి సైనాసైటిస్ తో ఇబ్బంది పడుతున్నాడు. చాలా సందర్భాల్లో శ్వాస తీసుకోవడానికి ఆయనకి ఇబ్బంది కలుగుతుందట.

ఇక ఎట్టకేలకు నిన్న ఆయనకి శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది ఉండడంతో అపోలో ఆసుపత్రి డాక్టర్లు తనకి సర్జరీ చేయాలని చెప్పి వెంటనే సర్జరీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం అతనికి శ్వాస తీసుకోవడం లో ఉన్న ఇబ్బందినైతే తొలగించారు. ఇక ఏది ఏమైనా కూడా డాక్టర్ల సూచన మేరకు ఆయన మరొక వారం రోజులపాటు కంప్లీట్ రెస్ట్ తీసుకునే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఈ ఆపరేషన్ కోసం దాదాపు 10 లక్షల వరకు డబ్బులు ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అపోలో ఆసుపత్రి రామ్ చరణ్ వైఫ్ అయిన ఉపాసన గారిదే కావడం వల్ల ఎప్పుడైనా సరే మెగా ఫ్యామిలీ హీరోలందరు ఆ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తుంటారు. ఇక ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ సైతం తొందరగా కోలుకోవాలని తన అభిమానులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు దేవుడిని కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper