Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Surender Reddy movie update: పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా...

Pawan Kalyan Surender Reddy movie update: పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా ఆగిపోయినట్టేనా..? కారణాలు ఏంటంటే!

Pawan Kalyan Surender Reddy movie update: ‘ఓజీ’ , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్ రోజున ఆ చిత్ర నిర్మాత రామ్ తళ్లూరి ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించాడు. అయితే నిన్న సాయంత్రం ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కార్యేటివే వర్క్స్ హ్యాండిల్ నుండి వచ్చిన ఒక ట్వీట్ ని చూస్తుంటే, ఆయన ‘ఓజీ 2’ కి తప్ప , ఏ సినిమాకు కమిట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి తో కథ విషయం లో చర్చలు జరిపిన విషయం వాస్తవమే. కానీ కథ మాత్రం ఇప్పటి వరకు లాక్ అవ్వలేదట. పలు మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ సూచించాడని, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నారని తెలుస్తోంది.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాల ప్లాన్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై రొటీన్ కమర్షియల్ ఫార్మటు లో సినిమాలు చెయ్యకూడదు అని ఆయన ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో చేయబోయేది గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ. అయినప్పటికీ కూడా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడం తో ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి జెన్ జీ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వడానికే మక్కువ చూపిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ‘ఓజీ’ తర్వాత ఆయనపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చేస్తే ఇక ఓజీ తరహా సినిమాలు చెయ్యాలి, లేదంటే అంతకు మించిన సినిమాలు చెయ్యాలి.

Also Read: ఒకప్పుడు ఆ దర్శకులు క్లోజ్ ఫ్రెండ్స్…కానీ ఇప్పుడు బద్ద శత్రువులా..? ఇంతకీ వాళ్లెవరంటే..?

తగ్గితే మాత్రం అభిమానులు అసలు ఊరుకునేలా లేరు. అందుకు లేటెస్ట్ ఉదాహరణే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . నిన్నటి ట్వీట్ ని బట్టీ అర్థం అవుతున్నది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ‘ఓజీ 2’. అది కూడా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతం సుజిత్ నాని తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై థియేటర్స్ లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టొచ్చు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జారబోతున్నాయి. దీనిపైనే ఆయన ప్రస్తుతం తన దృష్టిని కేంద్రీకరించాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ వరకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో కనిపించే అవకాశమే కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper