Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నాడు మెగా ఫ్యామిలీలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి(Megastar Chiranjeevi) కి దగ్గర బంధువైన ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్(Mehar Ramesh) సోదరి మాదాసు సత్యవతి నిన్న హైదరాబాద్ లో కన్ను మూసింది. ఈ సందర్భంగా నిన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేసారు. ముందుగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందిస్తూ ‘నా సోదరుడు మెహర్ రమేష్ సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారు నిన్న హైదరాబాద్ లో హఠాన్మరణం చెందింది అనే విషయం తెలుసుకొని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యాను. సత్యవతి గారి కుటుంబం విజయవాడలోని మాధవరం లో ఉండేది. వేసవి సెలవల్లో మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మెహర్ రమేష్, సత్యవతి ఆరోజుల్లో మా అందరితో ఎంతో సరదాగా ఉండేవాళ్ళు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా చిరంజీవి స్పందిస్తూ ‘తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ కూడా సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో మెహర్ రమేష్ స్పందిస్తూ ‘మా ప్రియమైన పెద్దక్క శ్రీమతి మాదాసు సత్యవతి నేడు స్వర్గస్తులైయ్యారు. కరోనా తో 2021 జనవరి లో దురదృష్టం కొద్దీ కోమాలోకి వెళ్లారు,మెరుగైన వైద్య సేవలు తో కోలుకున్నప్పటికీ ,నరాల బలహీనత తో కృంగిపోతుండేవారు,ఇదివరకటిలా ఆరోగ్యవంతురాలు గా చేయాలని నా శాయ శక్తులా చిరంజీవి అన్నయ్యగారి సహకారం తో ప్రయత్నించినా అక్క శివైక్యం చెందారు. శ్రీ నాగబాబు ,శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గార్లు & కుటుంబ సభ్యులు ,బంధుమిత్రులు ఈ సంతాప సమయం లో మా తోడున్నారు. సత్యక్క ఎప్పటికి మా జ్ఞాపకాల్లో అమరం’ అంటూ చెప్పుకొచ్చాడు.
అభిమానులు కూడా ఈ సందర్భంగా మెహర్ రమేష్ కి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ ఇది వరకు మన టాలీవుడ్ లో బిల్లా, కంత్రి, శక్తి., షాడో, భోళా శంకర్ వంటి చిత్రాలు చేసాడు. వీటిల్లో బిల్లా, కంత్రి కాస్త యావరేజ్ గా ఆడాయి కానీ, మిగిలిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ముఖ్యంగా 2023 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి తో చేసిన భోళా శంకర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఎలాంటి సినిమా లేదు. కనీసం ఒక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ కోసమైనా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు.