https://oktelugu.com/

Bheemla Nayak: పవన్ దెబ్బకు చెల్లాచెదురు.. తలలు పట్టుకున్న మిగిలిన హీరోలు !

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ లోనే ఉత్తమ చిత్రం అవుతుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి అలాంటి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. పైగా హీరో పవన్ కళ్యాణ్. అన్నిటికీ మించి ఇది మల్టీస్టారర్. అందుకే.. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇలాంటి ‘భీమ్లా నాయక్’ ఒక్కసారిగా తెలుగు బాక్సాఫీస్ పై […]

Written By:
  • Shiva
  • , Updated On : February 17, 2022 / 11:47 AM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ లోనే ఉత్తమ చిత్రం అవుతుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి అలాంటి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. పైగా హీరో పవన్ కళ్యాణ్. అన్నిటికీ మించి ఇది మల్టీస్టారర్. అందుకే.. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

    Bheemla Nayak

    ఇలాంటి ‘భీమ్లా నాయక్’ ఒక్కసారిగా తెలుగు బాక్సాఫీస్ పై పిడుగులా వచ్చి పడిపోయింది. మొదట ఏప్రిల్ 1న మా సినిమా విడుదల అవుతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ.. చివరి క్షణంలో మా సినిమా ఫిబ్రవరి 25 అంటూ సడెన్ గా ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే, మిగిలిన సినిమాల మేకర్స్ మాత్రం నిన్నటి నుంచి తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు.

    Also Read: ఈ అలవాట్లు మీకు ఉన్నాయా.. చాణక్య నీతి ప్రకారం పేదరికంతో బాధ పడాల్సిందే?

    తమ సినిమాల రిలీజ్ డేట్లును పోస్ట్ ఫోన్ చేసుకుంటే బెటర్ కదా ? అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అసలు ఒక్క సినిమా ప్రకటనతో.. ఇప్పుడు మిగిలిన తెలుగు సినిమాల విడుదల షెడ్యూల్ కూడా తారుమారు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కాదు అని క్లారిటీ తీసుకున్న తర్వాతే.. శర్వానంద్ తన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని ఆ రోజు రిలీజ్ కి రెడీ చేసుకున్నాడు.

    అందుకు తగ్గట్టు సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ను అదే రోజు ఫిక్స్ చేశారు. సడెన్ గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసేసరికి.. వరుణ్ తేజ్ గని సినిమా రిలీజ్ ను మార్చికి పోస్ట్ ఫోన్ చేశారు. కానీ శర్వానంద్ మాత్రం తన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.

    Bheemla Nayak

    ఇప్పటికి అయితే.. ఒక రోజు లేటుగా ఫిబ్రవరి 26న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను రిలీజ్ చేస్తే.. ఓపెనింగ్స్ ఎలా వస్తాయి ? అసలు సినిమాకి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ దెబ్బకు కొత్త డేట్స్ ఇలా ఉండబోతున్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు – ఫిబ్రవరి 26, గని – మార్చి 4, రాధేశ్యామ్ – మార్చి 11, సెబాస్టియన్ పీసీ 524 – మార్చి 17 రాబోతున్నాయి. మొత్తానికి పవన్ దెబ్బకు చెల్లాచెదురు అయిపోయాయి. మిగిలిన హీరోలు తలలు పట్టుకుని కూర్చున్నారు.

    Also Read: బప్పిలహరి ఒంటి మీద ఉన్న బంగారం ఎంతో తెలిస్తే షాక్.. వాటిని ఏం చేస్తున్నారంటే?

    Tags