https://oktelugu.com/

Bheemla Nayak Prerelease Event: ‘భీమ్లా నాయక్’ ట్రైలర్, ప్రీ రిలీజ్​ ఈవెంట్ ఎప్పుడంటే ?

Bheemla Nayak Prerelease Event: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అలాగే.. ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రచారంతో అభిమానుల్ని అలరించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ప్రస్తుతం ట్రైలర్​ పనుల్లో టీమ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 17, 2022 / 11:34 AM IST
    Follow us on

    Bheemla Nayak Prerelease Event: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అలాగే.. ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రచారంతో అభిమానుల్ని అలరించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ప్రస్తుతం ట్రైలర్​ పనుల్లో టీమ్​ బిజీగా ఉంది.

    Pawan Kalyan Bheemla Nayak

    కాగా ఫిబ్రవరి 18న ట్రైలర్​ విడుదల చేస్తారని తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి 21న హైదరాబాద్​లో గ్రాండ్​గా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించనున్నారని సమాచారం. మరోపక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.

    Also Read:  అలీకి జగన్ ఇవ్వబోతున్న పదవి అదేనట ?

    ఇక భీమ్లా నాయక్ నుండి తదుపరి పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ రోజు సాయంత్రం రివీల్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయట. పైగా థమన్ ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి ఒక అప్ డేట్ ఇస్తూ.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని చెప్పుకొచ్చాడు.

    Pawan Kalyan, Rana Bheemla Nayak

    కాగా ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం థమన్ బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్‌ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా పవన్ నుంచి వస్తున్న క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి.

    Also Read: ‘హేయ్ సినామికా’ అంటూ ట్రైలర్ వదిలిన మహేష్ బాబు !

    Tags