Anchor Suma: ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి.. గల గలా మాట్లాడే ఆ గొంతుకు.. ఇప్పటికీ విశ్రాంతి లేదు. కోట్లాది మందిని తన మాటల్తో నవ్విస్తోంది, మైమరిపిస్తోంది. నా మాటే శాసనం అన్నట్టు.. ఆమె ఎక్కడ ఉంటే ఆమె మాటనే పైచేయి. అంతలా తెలుగు వారిని తన మాటల్తో కట్టిపడేసింది యాంకర్ సుమ. వాస్తవానికి కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయిగా హైదరాబాద్ వచ్చిన సుమ.. మొదట్లో సీరియల్స్‌లో నటించేంది.
మేఘమాట సీరియల్ నటించేక్రమంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. ఆ మేఘమాల సీరియల్‌కు డైరెక్షన్ చేసింది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమగా మారింది. అది కాస్తా ఇద్దరినీ ఓ ఇంటి వారిని చేసేసింది. ఈ గ్యాప్‌లోనే వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కాగా హైదరాబాద్ లో ఉండటం వల్ల తెలుగు మీద మంచి పట్టు సాధించింది.
పెండ్లయ్యాక కూడా ఆమె సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అన్వేషిత, మందాకిని, జీవనరాగం లాంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది. అయితే వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బుల్లితెరపై వచ్చిన స్టార్ మహిళ, అవాక్కయ్యారా, భలే ఛాన్సలే లాంటి కార్యక్రమాలతో మహిళలకు బాగా దగ్గరయింది. కాగా ఆమె దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో హీరోయిన్‌గా ఓ మూవీ కూడా చేసిందండోయ్.
Also Read: పవన్ దెబ్బకు చెల్లాచెదురు.. తలలు పట్టుకున్న మిగిలిన హీరోలు !
అది కూడా పెండ్లి కాక ముందే. 1996లో నారాయణ రావు తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్‌గా చేసింది. ఇందులో మరో హీరోయిన్‌గా కావ్య నటించగా.. హీరోగా వక్కంతం వంశీ నటించారు. కాగా ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అప్పటికే దాసరి పెద్ద డైరెక్టర్‌గా ఉన్నారు. ఒకవేళ ఈ మూవీ గనక హిట్ అయితే ఆమెకు హీరోయిన్‌గా మరిన్ని ఛాన్సులు వచ్చేవేమో.
అయితే వెండితెరపై ఛాన్సులు తగ్గినా.. బుల్లి తెరపై స్టార్ హీరోయిన్‌గా ఇరవై ఏండ్లుగా రాణిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె క్యాష్ ప్రోగ్రామ్‌తో పాటు పెద్ద ఆడియో ఫంక్షన్లకు యాంకర్‌గా చేస్తోంది. ఇక పోతే ఆమె ఇప్పుడు జయమ్మ పంచాయతీ అనే మూవీలో లీడ్ రోల్‌లో నటిస్తోంది.
Also Read: ‘భీమ్లా నాయక్’ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే ?