Pavan Kalyan: టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మాములుగా లేదు..రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదు చేసుకున్నాయి..ఈ రెండు సినిమాలు కూడా తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల మధ్యనే విడుదలయ్యాయి..కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి..OTT రాజ్యం ఏలుతున్న సమయంలో OTT లో ఏళ్ళ తరబడి ఉంటున్న సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి..ఇక భీమ్లా నాయక్ అయితే రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా ఓవర్సీస్ లో దాదాపుగా 4 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది..నిజంగా ఇది పవర్ స్టార్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పొచ్చు..ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ తో హరిహర వీరమల్లు , అలాగే తమిళ్ లో సూపర్ హిట్ అయినా వినోదయ్యా సీతం రీమేక్ లో నటిస్తున్నాడు..వీటితో పాటు త్వరలోనే హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రారంబించబోతున్నాడు.

Also Read: Rana Daggubati: ప్రముఖ హీరోయిన్ స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన రానా దగ్గుపాటి
ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా తేరి సినిమాని రీమేక్ చేయబోతున్నాడని..దీనికి సాహూ సినిమా దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తాడు అని, ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి..అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి..తేరి సినిమాని ఒక ప్రముఖ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్న విషయం వాస్తవమే అని..కానీ ఆ సినిమా చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని తెలుస్తుంది..విజయ్ హీరో గా నటించిన తేరి సినిమా 2016 వ సంవత్సరం లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఇదే సినిమాని తెలుగులో పోలీసోడు పేరు తో రీమేక్ చేసారు..ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది..ఇక TV లో అయితే ఇప్పటికి వంద సార్లు టెలికాస్ట్ చేసి ఉంటారు..అలాంటి సినిమాని ఇప్పుడు రీమేక్ చేస్తే ఎవ్వరు చూడరని..అనవసరం గా సమయం డబ్బు వృధా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది..మరో విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ త్వరలో చెయ్యబోతున్న వినోదయ్యా సీతం సినిమానే ఆఖరి రీమేక్ చిత్రం అని..ఇక నుండి ఆయన రీమేక్ సినిమాలలో నటించబోరని సోషల్ మీడియా లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.

Also Read: Mahesh Babu- Rajamouli: రాజమౌళి స్పందించడా..? మహేష్ బాబుకు ఏంటి పరిస్థితి? అంత మంచితనం పనికిరాదా?

[…] […]