Presidential Election TDP and YCP: దేశ రాజకీయాల్లో ఏపీది ప్రత్యేక స్థానం. ఉత్తరాధి రాష్ట్రాల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది… ఢిల్లీ రాజకీయాలను శాసించింది కూడా ఏపీనే. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం కీ రోల్ పాత్ర పోషించింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ నాడు ఇందిరాగాంధీకి గట్టి సవాలే విసిరారు. తరువాత సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కూడా కీలక భూమిక వహించారు. అటు తరువాత చంద్రబాబు సైతం ఇదే పరంపరను కొనసాగించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి ఎంపిక చేయడంలో కూడా చంద్రబాబు పాత్ర ఉందని నాటి బీజేపీ నాయకలే గుర్తుచేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం నాటి చరిత్రను మసకబార్చుతున్నాయి. ఏపీ నేతలకు ఏమైందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గడిచిన సారి రాష్ట్రపతి ఎన్నికలు, ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అధికార పక్షం, విపక్షం అనుసరిస్తున్న తీరు నివ్వెరపరుస్తోంది. రాష్ట్రంలో కొట్టుకుంటాం కానీ.. ఢిల్లీ విషయానికి వచ్చేసరికి కలిసుంటామనే విధంగా ఇరు పార్టీల నేతలు వ్యవహరిస్తుండడంతో జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో..
గడిచిన రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ సైతం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉంది. అటు బీజేపీ సైతం రాష్ట్ర ప్రభుత్వంలో పాలుపంచుకుంది. నాడు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్నో పేర్లు తెరపైకి వచ్చినా చివరకే బిహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేశారు. అయితే ఎన్డీఏ భాగస్థుడిగా చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఇది అందరూ ఊహించిందే అయినా.. విపక్ష నేత జగన్ కూడా నాడు ఎన్డీఏ కే బలపరిచారు. రాష్ట్రంలో చంద్రబాబుతో హోరాహోరీగా తలపడుతూ వచ్చిన ఆయన .. అదే చంద్రబాబును అనుసరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి అభ్యర్థి ఉన్నా.. కాంగ్రెస్ తో కలిసి నడిచి వెళ్లడానికి ఇష్టపడడం లేదన్న సాకు చూపి జగన్ ఎన్డీఏ వైపే మొగ్గుచూపారు. ఒకప్పటి తన మాతృ సంస్థ అయినా జగన్ ముఖం చాటేశారు. తాను రాజకీయంగా పోరాడుతున్న చంద్రబాబు బాటలో నడిచారు. అయితే అదంతా నాడు కేసులకు భయపడి జగన్ అ విధంగా వ్యవహరించారని అందరూ సరిపుచ్చుకున్నారు. చంద్రబాబు కూడా సేమ్ ఇలాగే ఆలోచించారు. కానీ బీజేపీతో నాటి జగన్ దోస్తీ నేడు ఈ స్థితికి కారణమవుతుందని తెలిసి ఉంటే మాత్రం నాడే చంద్రబాబు షరతులు విధించేవారు.
Also Read: Education System in AP: ఏపీలో విద్యావ్యవస్థ నిర్వీర్యం. ఆ జీవోలతో అస్తవ్యస్తం
సేమ్ సీన్..
సరిగ్గా ఐదేళ్లు తరువాత ఇప్పడు మరోసారి రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. నాడు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు మరిప్పుడు లేరు. జగన్ బీజేపీకి దగ్గరగా ఉన్నా అధికారికంగా ఎన్డీఏలో చేరలేదు. ఇటువంటి సమయంలో ఎన్డీఏ తన రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. గత మూడేళ్లుగా అడగకుండానే బీజేపీకి అవసరమైనప్పుడు సాయం చేసిన జగన్.. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థికి భేషరతుగా మద్దతు ప్రకటించారు. నామినేషన్ ప్రక్రియకు కీలక నేత విజయసాయిరెడ్డిని సైతం పంపించారు. అయితే వైసీపీతో పోల్చుకుంటే సంఖ్యాబలం తక్కువగా ఉన్నా చంద్రబాబు నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఐదేళ్ల కిందట నాటి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. నాడు జగన్ అనుసరించిన వ్యూహాన్నే చంద్రబాబు కూడా అవలంభించారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కొట్టుకుంటాం కానీ..తామమనసు ఒకటేనని చాటిచెప్పారు.
ఎవరి అవసరం వారిది..
వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకు కేంద్ర ప్రభుత్వ అవసరం ఉంది. గత ఎన్నికల నాటి నుంచి బీజేపీ ప్రాపకం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలంటూ లేవు. కానీ గత అనుభవాల దృష్ట్యా బీజేపీ పెద్దలు దూరం పెంచుతూ వచ్చారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల వేళ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దీంతో బీజేపీ పెద్దలు కొంత మనసు మార్చుకున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ ది కూడా అదే పరిస్థితి. గత ఎన్నికల్లో కేంద్ర పెద్దలు ఇతోధికంగా సాయం చేసిన విషయాన్ని గుర్తు పెట్టకున్నారు. వారితో కటీఫ్ అయితే వచ్చే ఇబ్బందులు కూడా తెలుసు. అందుకే కేంద్ర పెద్దల వద్ద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read:Vice President Venkaiah Naidu: వెంకయ్యనాయుడుకు ఇక రిటైర్మెంటేనా?