Pawan Kalyan reaction Ram Charan injury: ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో నిన్న సాయంత్రం రామ్ చరణ్(Global star Ram charan) నుదిటి పై గాయం అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 30 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని ఎట్టిపరిస్థితిలోనూ ఈ నెల 27 లోపు పూర్తి చెయ్యాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాలన్స్ ఉన్నటువంటి ఐటెం సాంగ్ ఏప్రిల్ మొదటి వారం లోపు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి ఏప్రిల్ 30 న విడుదల టార్గెట్ గా మూవీ టీం మొత్తం క్షణం కూడా వృధా చేయకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుతోంది. రామ్ చరణ్ కూడా రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటూ ఈ సినిమాని పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తున్నాడు.అయితే రామ్ చరణ్ కి గాయాలు అయ్యాయి అనే విషయాన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ , ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘అగ్రశ్రేణి యువ కథానాయకుడు రామ్ చరణ్ పెద్ది మూవీ షూటింగ్ చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ని చూసి మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయం లో పవన్ కళ్యాణ్ నుండి ఈ ట్వీట్ రావడం తో అందరూ శాంతించారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు , ఎప్పటికీ ఇంతే అనుబంధం తో ఉంటారు, అభిమానులే సమయాన్ని వృధా చేసుకుంటూ ఫైటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, ఇకనైనా ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దంటూ మెగా అభిమానుకులు కొంతమంది హితవు పలుకుతున్నారు.
ఇక పెద్ది మూవీ షూటింగ్ విషయానికి వస్తే, రేపటి నుండి రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు నుండే ఆయన షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ , కానీ డాక్టర్లు కచ్చితంగా ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడం తో రేపటి నుండి ఆయన మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 న విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ రప్పించేలా ఉంటుందని అంటున్నారు. ఇది వరకు పెద్ది క్రికెట్ ఆడడమే చూశారు, కుస్తీ ఆడితే ఎలా ఉంటుందో ఈ టీజర్ లో చూస్తారని అంటున్నారు మెగా ఫ్యాన్స్.
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి
అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
– @PawanKalyan@AlwaysRamCharan @PIB_India @IPR_AP @pibvijayawada
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2026
