Game Changer: నిన్న జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మెగా అభిమానుల్లో ఒక రేంజ్ జోష్ ని నింపే ప్రసంగం అందించి వెళ్ళాడు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నిన్నటి ఈవెంట్ తో విపరీతమైన హైప్, క్రేజ్ ఏర్పడేలా చేసాడు. సినిమాకి పని చేసిన ప్రతీ టెక్నీషియన్ గురించి పేరుపేరునా మాట్లాడుతూ, మరోపక్క రాజకీయ కోణం లో కూడా స్పందిస్తూ, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాలు కూడా చెప్పుకొచ్చాడు. ‘చాలా మంది హీరోలు మా కూటమికి మద్దతు ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా వాళ్లపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. టికెట్ రేట్స్ ఇచ్చాము. తెలుగు సినిమాని ప్రోత్సహించడం లో మా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుంది’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎంత ఎత్తుకి ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి స్వర్గీయ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఎన్నో అద్భుతమైన మార్గాలు చూపించారు. వాళ్ళు చూపించిన మార్గం లోనే మేమంతా నడుస్తున్నాము. సినిమా గురించి కేవలం సినిమాలను తీసేవాళ్ళు మాత్రమే మాట్లాడాలి. వాళ్లకు సాధక బాధకాలు తెలుస్తాయి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మధ్యలో అభిమానులు ‘జిందాబాద్ కళ్యాణ్ బాబు’,’ఓజీ..ఓజీ’ అని అరుస్తుండడం ని గమనించిన పవన్ కళ్యాణ్ ‘మీరు ఎన్ని నినాదాలు చేసినా, నేను కానీ, రామ్ చరణ్ కానీ, మా ఇంట్లో ఏ హీరో అయినా కానీ ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు మూలకారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎక్కడో మొగళ్తూరు అనే చిన్న గ్రామం నుండి వచ్చిన ఆయన నేడు మెగాస్టార్ గా ఎదిగి ఇంతమందికి ఆదర్శప్రాయమయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘చిన్నప్పటి నుండి నేను ఆయన కష్టాలను చూస్తూ పెరిగిన వాడిని. షూటింగ్స్ కి వెళ్లి, ఒళ్ళు హూనం చేసుకొని ఇంటికి వస్తున్న రోజులను చూసి నేను ఎంతో బాధపడేవాడిని. ఒక్కోసారి ఆయన బూట్లు తీసుకోకుండానే పడుకునేస్తాడు. ఆయన షూస్ ని తీసినప్పుడు నాకు మా అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో అని బాధ కలిగేది. ఆయన చూపించిన దారిలోనే మేమంతా నడిచాము. ఈరోజు నేను ఇంత ఉన్నత స్థాయిలో నిలబడి ఇన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అందుకు మూల కారణం చిరంజీవి గారు. నేను మూలలను ఎప్పుడూ మర్చిపోను’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మీద పవన్ కళ్యాణ్ చూపించిన ప్రేమానురాగాలు కూడా అభిమానులు చిరస్థాయిగా గుర్తించుకునే రేంజ్ లో ఉన్నాయి.
Chiranjeevi pic.twitter.com/GGrzK9Nb4W
— Siddhu Manchikanti Potharaju ☭ (@SiDManchikanti) January 4, 2025