Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ ని తలపించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రంగస్థలం సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథి గా వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో మన అందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడిన మాటలను మెగా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. చిరస్థాయికి గుర్తించుకోదగ్గ ఈవెంట్ అది. నిన్న జరిగిన ‘గేమ్ చేంజర్’ ఈవెంట్ దానిని మించిపోయింది. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని నా తమ్ముడు..నా బంగారం అంటూ ప్రేమగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వ్యాప్తి చెందింది. వీళ్ళ బంధం ని చూసిన తర్వాత, ప్రతీ ఒక్కరికి బాబాయ్ – అబ్బాయి అంటే ఇలాగే ఉండాలి అనే భావన కలుగచేస్తుంది. ఇంతకీ ఆయన రామ్ చరణ్ గురించి ఈ ఈవెంట్ లో ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
ముందుగా తన అన్నయ్య చిరంజీవి గురించి చెప్తూ ‘పవన్ కళ్యాణ్ అయినా, రామ్ చరణ్ అయినా ఈరోజు ఇలా ఉన్నారంటే అందుకు మూల కారణం మా అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి. ఆయన నాకు తండ్రి లాంటి వాడు, మా వదిన నాకు అమ్మ, రామ్ చరణ్ నా తమ్ముడు. మీరంతా ఈరోజు డిప్యూటీ సీఎం అని అరిచినా, కళ్యాణ్ బాబు అని అరిచినా దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు నేను ఈ స్థాయిలో నిల్చొని, మారుమూల గ్రామాల్లో కూడా రోడ్స్ వెయ్యిస్తున్నాను అంటే, దానికి స్ఫూర్తిని ఇచ్చిన మహా మనిషి మా అన్నయ్య’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘తండ్రికి తగ్గ వారసుడు, తండ్రి మెగాస్టార్ అయితే, కొడుకు గ్లోబల్ స్టార్ కాక ఇక ఏమి అవుతాడు’ అంటూ ఎంతో అద్భుతంగా మాట్లాడుతాడు.
ఇంకా మాట్లాడుతూ ‘మా నాన్న చరణ్ కి నామకరణం చేసాడు. మా ఇంట్లో అందరూ ఆంజనేయ స్వామి భక్తులు, అన్ని పేర్లను వాడేశారు, అన్నయ్య కొడుక్కి ఏ పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో మా నాన్న రామ్ చరణ్ అని పేరు పెట్టాడు. రామ్ చరణ్ అంటే రాముడి చరణాల వద్ద ఉన్న హనుమంతుడు అని అర్థం. తన బలం గురించి, శక్తి గురించి తెలిసినప్పటికీ కూడా ఎంతో విధేయుడిగా ఉంటాడు హనుమంతుడు. రామ్ చరణ్ కూడా అంతే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం. సంవత్సరం లో వంద రోజులు ఎప్పుడూ మాలలోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్లినా చెప్పులు లేకుండానే వెళ్తాడు. హాలీవుడ్ స్థాయికి వెళ్లిన నటుడు అయినా కూడా అంతనిలోని సింప్లిసిటీ నాకు చాలా నచుతుంది. నా బంగారం,నా తమ్ముడు రామ్ చరణ్ కి భవిష్యత్తులో ఎన్నో విజయాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఈ క్రింది వీడియో లో చూడండి.
. @PawanKalyan Lifetime Elevations on @AlwaysRamCharan
Their Bonding is something else ♥️ ♥️pic.twitter.com/BdH9Pl5ezM
— Pawanism™ (@santhu_msd7) January 4, 2025