Tollywood Heroine : విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని ఆయన అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. టైగర్ సినిమా వంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఆయన అభిమానులు విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. రౌడీ హీరోకు తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా విజయ్ దేవరకొండకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో విజయ్ ఖాతాలో పెద్ద హిట్స్ లేకపోయినా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెలవేగంగా జరుగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చాలామంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలో ఉన్న విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.
Also Read: ఒకప్పుడు మిస్ ఇండియా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టగలరా.
విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తన కెరియర్ స్టార్టింగ్ లో విజయ్ దేవరకొండ ద్వారక అనే సినిమాలో నటించాడు. పెళ్లిచూపులు సూపర్ హిట్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన తర్వాతి సినిమా ద్వారక. అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అసలు ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలామందికి తెలియదు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన హీరోయిన్ పేరు పూజా జవేరి.
పూజా జవేరి బం భోలేనాథ్ అనే సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. తెలుగుతోపాటు ఈ చిన్నది తమిళ్, కన్నడ, గుజరాతి భాషలలో పలు సినిమాలలో నటించింది. తెలుగులో ఈమె జగన్నాటకం, రైట్ రైట్, టచ్ చేసి చూడు, 47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ ఇప్పటివరకు ఈమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్గా తన గ్రామస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
View this post on Instagram