Pawan Kalyan look from Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి వీరాభిమాని గా పిలవబడే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించేందుకు అహర్నిసలు కష్టపడుతున్నట్టు కాసేపటి క్రితమే విడుదలైన పోస్టర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఇలా కూడా ఊహిస్తారా? అనే విధంగా ఆయన చేత స్టైలిష్ స్టెప్పులు వేయిస్తున్నట్టుగా అనిపించిన ఈ ఫోటోని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ లో ఒకప్పటి జోష్ ని , ఎనర్జీ ని మరోసారి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆనందం తో ట్వీట్ లు వేస్తున్నారు. ఇంతకంటి గొప్ప బర్త్ డే సర్ప్రైజ్ రావడం కష్టమని, హరీష్ శంకర్ ఈ పోస్టర్ తో ఏకంగా సిక్సర్ కొట్టేశాడని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈరోజు విడుదల చేసిన పోస్టర్ ఈ సినిమాలో పార్టీ సాంగ్ లాగా ఉంటుందట. పవర్ స్టార్ చేత అదిరిపోయే రేంజ్ స్టెప్పులు వేయించాడట. పాట థీమ్ రెట్రో స్టైల్ లో ఉంటుందని సమాచారం. రెట్రో అంటే పాత కాలం తరహా పాట అన్నమాట. పవన్ కళ్యాణ్ చివరిసారిగా మంచి డ్యాన్స్ వేసిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లోని ఎనర్జీ మొత్తాన్ని బయటకు తీసి ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ స్టెప్పులు వేయించాడు హరీష్ శంకర్. మరోసారి అదే రేంజ్ స్టెప్పులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా వేయించినట్టు తెలుస్తుంది. ఈ పాటలో శ్రీలీల కూడా ఉంటుంది. ఆమె పక్కన ఎనర్జిటిక్ స్టెప్పులంటే ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. అభిమానులకు ఫుల్ మీల్స్ భుక్తాయాసం వచ్చే రేంజ్ లో పెట్టబోతున్నాడని ఒక క్లారిటీ అయితే ఫ్యాన్స్ కి వచ్చేసింది.
ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే కేవలం ఒకే ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట. ఈ పాటని ఈ నెల 7వ తారీఖు నుండి చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అంటే మినిమం రేంజ్ గ్యారంటీ అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలోని పాటలన్ని బ్లాస్టింగ్ రేంజ్ లో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ సినిమాకు బదులుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ చేత మైఖేల్ జాక్సన్ స్టెప్పులు..హరీష్ శంకర్ మామూలోడు కాదు!
ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ ఈ సినిమాలో పార్టీ సాంగ్ లాగా ఉంటుందట.
పవర్ స్టార్ చేత అదిరిపోయే రేంజ్ స్టెప్పులు వేయించాడట. పాట థీమ్ రెట్రో స్టైల్ లో ఉంటుందని సమాచారం. రెట్రో… pic.twitter.com/vmWz320QV9
— OkTelugu (@oktelugunews) September 1, 2025