Pawan Kalyan: ‘ఓజీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చ్ నెలలో కానీ, లేదా ఏప్రిల్ లో నెలలో కానీ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తాడా ?, చేస్తే ఎవరితో చేస్తాడు అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. ఏడాది ప్రారంభం లోనే సురేందర్ రెడ్డి తో తన తదుపరి సినిమా ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం ఎప్పటి నుండి మొదలు అవుతుతోంది?, ఎలాంటి స్టోరీ తో రాబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది నుండి మరో కొత్త ప్రయాణం ని మొదలు పెట్టబోతున్నాడు. చాలా కాలం క్రితమే ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థ ని స్థాపించి కొన్ని సినిమాలను నిర్మించి, ఫెయిల్యూర్స్ ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ నిర్మాణం వైపు పోలేదు. ఇప్పుడు మళ్లీ తన బ్యానర్ ని రీ యాక్టీవ్ చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి ఆయన 5 సినిమాలు చేయబోతున్నాడు. అందులో మూడు సినిమాలు నిర్మాతగా, రెండు సినిమాలు నిర్మాతగా + హీరో గా అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ గురించి నేడు పవన్ కళ్యాణ్ తన నివాసం లో విశ్వప్రసాద్ ని పిలిపించుకొని చర్చించాడు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశానని , త్వరలోనే మేమిద్దరం కలిసి కొన్ని ఇన్నోవేటివ్ సినిమాలను నిర్మించబోతున్నామని, కొత్త టాలెంట్ ని, కొత్త విజన్ ని ప్రోత్సహిస్తాం అంటూ నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు.
అంతే కాదు వీళ్ళ కలయిక లోనే ఓజీ సీక్వెల్ కూడా ఉంటుందట. వచ్చే ఏడాది జనవరి నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇది ఓజీ కి ప్రీక్వెల్ గా ఉండబోతుంది అన్నమాట. ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ నాని తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడని టాక్. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ద్రుష్టి మొత్తాన్ని పాలనపైనే కేంద్రీకరించాడు. డిప్యూటీ సీఎం గా క్షణం తీరిక లేకుండా గడుపున్న ఆయన ఈ ఏడాది సెకండ్ హాఫ్ వరకు షూటింగ్స్ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆగస్టు, లేదా సెప్టెంబర్ నెలలో సురేందర్ రెడ్డి తో చేయబోయే సినిమా మొదలు కానుంది.
Marking the spirit of new beginnings on the auspicious occasion of Bhogi, and taking forward earlier discussions on upcoming projects, Sri @PawanKalyan met with @peoplemediafcy Producer Sri @vishwaprasadtg for further deliberations.#PawanKalyanCreativeWorks pic.twitter.com/GPQAAiQ6BN
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 14, 2026