Karate Kalyani: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పేరు ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసిన అతని గురించే చర్చ. ప్రపంచ యాత్రికుడిగా దాదాపుగా 135 దేశాల్లో ప్రయాణించి , అక్కడి లొకేషన్స్ ని, అక్కడి ప్రజల నాగరికతను వివరిస్తూ ఆయన చేసిన వీడియోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 40 లక్షల మంది ఆయన్ని యూట్యూబ్ లో అనుసరిస్తూ ఉన్నారు. అంతే కాకుండా గత ఏడాది బెట్టింగ్ యాప్స్ ని అరికట్టడం లో అన్వేష్ చాలా ప్రముఖమైన పాత్ర పోషించాడు. అందుకు ఆయనకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ శివాజీ మ్యాటర్ లో ఆయన నోరు జారిన విధానం ని చూసి ఇంత కాలం అతన్ని అనుసరించిన వాళ్ళే బూతులు తిట్టడం మొదలు పెట్టారు.
హిందూ దేవుళ్లపై అతను చేసిన నీచమైన కామెంట్స్ ని చూసి , ఇండియా కి వస్తే చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. అంతే కాకుండా అన్వేష్ ని వెంటనే ఇండియా కి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనీ , జాతికి ఇలాంటోళ్ళు అత్యంత ప్రమాదకరమైన వాళ్ళని అంటున్నారు. ఇప్పటికే ఇతని పై తెలంగాణ లో అనేక కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కరాటే కళ్యాణి అన్వేష్ ని ఇండియా కి తీసుకొచ్చేంత వరకు నిద్రపోయేలా లేదు. ఇప్పటికే అతని పై పలు సెక్షన్ల క్రింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసుని నమోదు చేసింది. అయితే రీసెంట్ గానే అన్వేష్ భారత దేశ పాస్ పోర్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలు కూడా వివాదాలకు దారి తీశాయి. మన దేశ పాస్ పోర్ట్ ని అన్వేష్ అవమానించాడని, దేశాన్ని కించపరిచే అతడి పాస్ పోర్టుని తక్షణమే రద్దు చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయాన్నీ అంత తేలికగా వదిలేది లేదని, త్వరలోనే పాస్ పోర్ట్ అథారిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె మీడియా తో చెప్పుకొచ్చింది .
సినీ పరిశ్రమ నుండి కేవలం కరాటే కళ్యాణి మాత్రమే అన్వేష్ విషయం లో తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, అన్వేష్ ని ఎలా అయినా ఇండియా కి రప్పించి అరెస్ట్ చేయించాలని చూస్తుంది. పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేశారు, అతని ఇన్ స్టాగ్రామ్ వివరాలను ఇవ్వాలని, అతను ఎక్కడున్నాడో అడ్రస్ కూడా చెప్పాలని ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్ కి పోలీసులు లేఖ రాశారు. అంత వరకే పోలీసుల నుండి కదలిక ఉంది. అన్వేష్ ని వాళ్ళు ఎందుకో సీరియస్ గా తీసుకోలేదని అనిపిస్తుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు తల్చుకుంటే ఒక్క రోజులో అన్వేష్ ని ఇండియా కి తీసుకొని రాగలరని, కానీ ఎందుకో ద్రుష్టి పెట్టడం లేదని అంటున్నారు.
అన్వేష్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలి: కరాటే కళ్యాణి
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) భారత పాస్‌పోర్ట్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
దేశ పాస్‌పోర్ట్‌ను అవమానించారంటూ నటి కరాటే కళ్యాణి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశాన్ని కించపరిచిన… pic.twitter.com/0VRYlUX03B— ChotaNews App (@ChotaNewsApp) January 13, 2026