Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Aditya Dhar Meeting: పవన్ కళ్యాణ్ తో 'ధురంధర్ 2' డైరెక్టర్ ఆదిత్య...

Pawan Kalyan Aditya Dhar Meeting: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

Pawan Kalyan Aditya Dhar Meeting: రీసెంట్ గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. 5 నెలల క్రితమే ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని అటు ఓపెనింగ్స్ పరంగా, లాంగ్ రన్ పరంగా తన సత్తా చాటిన పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఈ చిత్రం , వారం రోజులకే తక్కువ షేర్స్ ని నమోదు చేసుకునే పరిస్థితికి రావడం అభిమానులకు తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అయితే ఇక పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు?, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితం ఆయన వరకు చేరిందా ?, లేదంటే హరీష్ శంకర్ రుద్దుతున్నట్టు సూపర్ హిట్ అనుకుంటున్నాడా అనే సందేహం అభిమానుల్లో ఉండేది. కానీ వారి అనుమానం లో ఎలాంటి నిజం లేదు.

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కి వాస్తవంగా ఎలాంటి ఫలితం వచ్చింది అనేది పవన్ కళ్యాణ్ కి తెలిసింది. దీంతో ఆయన బాగా అలెర్ట్ అయ్యి తన కెరీర్ ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం అయన ఒక కొత్త టీం ని కూడా రిక్రూట్ చేసుకున్నాడు. జెన్ జీ కుర్రాళ్లతో ఏర్పాటు చేసిన ఈ టీం, ఇక నుండి పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ ని లాక్ చేయనుంది. ఏ డైరెక్టర్ అయినా ఒక కథ ని రెడీ చేసి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకొని వెళ్లాలంటే ముందు ఈ టీం కి వినిపించాలట, అది కూడా బౌండెడ్ స్క్రిప్ట్ తో మాత్రమే. వీళ్ళు అప్రూవల్ తెలిపిన తర్వాతే పవన్ కళ్యాణ్ వద్దకు ఆ స్క్రిప్ట్ వెళ్తుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ‘ధురంధర్ 2’ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య డర్ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కొత్త టీం ద్వారానే వీళ్లిద్దరి మధ్య ఈ భేటీ జరిగిందట. అయితే వీళ్లిద్దరు ఎందుకు భేటీ అయ్యారు అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ, పవన్ కళ్యాణ్ ఆదిత్య డర్ ని ‘ధురంధర్ 2’ తీసినందుకు పొగడ్తలతో ముంచి ఎత్తి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా చాలా కాలం క్రితమే ఆదిత్య డర్ పవన్ కళ్యాణ్ కోసం ఒక ప్రత్యేక అంశం పై కథ ని రాసుకున్నాడట. 2024 లోనే ఈ కథని వినిపించడానికి ప్రయత్నం చేశాడట కానీ , పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల కుదర్లేదు అట. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త కథలను వినే మోడ్ లో ఉండడం తో ఆదిత్య డర్ స్వయంగా పవన్ కళ్యాణ్ తన టీం ద్వారా ఇంటికి పిలిపించి చర్చలు జరిపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అంటే త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అన్నమాట. సరైన సమయం దొరికినప్పుడు ఈ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...
Oktelugu Epaper
Exit mobile version