Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu daughter Sitara viral video: జూనియర్ ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన మహేష్ బాబు...

Mahesh Babu daughter Sitara viral video: జూనియర్ ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన మహేష్ బాబు కూతురు సితార.. వీడియో వైరల్!

Mahesh Babu daughter Sitara viral video: సోషల్ మీడియాలో నెటిజెన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న స్టార్స్ కిడ్స్ లో ఒకరు ఘట్టమనేని సితార(Ghattamaneni Sithara). చిన్న వయస్సు నుండే ఈ చిన్నారి ఇన్ స్టాగ్రామ్ ని ఉపయోగించడం మొదలు పెట్టింది. తన తండ్రి పేరు వాడుకోకుండా, సొంత టాలెంట్ తో తనకు తోచింది చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అంతే కాదు, ఈమె వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించింది. అందులో ఈమె చేసే వంటలు , గీసే డ్రాయింగ్స్, మరియు ఇతర యాక్టివిటీస్ చూస్తే ఇంత చిన్న వయస్సులో ఈ రేంజ్ టాలెంట్ ఎలా సాధ్యం ?, ఎంతైనా మహేష్ బాబు(Superstar Mahesh Babu) కూతురు కదా, ఆ రక్తం అలాంటిది అని అనిపించక తప్పదు. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ఒక పార్టీ లో తన స్నేహితులతో కలిసి చిందులు వేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఏ ఈవెంట్ లో ఈ చిన్నారి పాల్గొందో తెలియదు కానీ, ఎన్టీఆర్ దేవర చిత్రం లోని ‘జాతర’ పాట ప్లే అవ్వడం , అందుకు ఈమె డ్యాన్స్ చేయడం వంటివి ఈ వీడియో లో మనం చూడొచ్చు. సోషల్ మీడియా లో ఎన్టీఆర్ , మహేష్ బాబు అభిమానులు కొట్లాడుకుంటూ ఉంటారు, కానీ రియల్ లైఫ్ లో వీళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయో , ఎంత సాన్నిహిత్యం గా ఉంటారో చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. వారిలో వారికి ఎలాంటి ఈగోలు ఉండవు, అంతా స్నేహం గానే ఉంటారు, ఒకరి సక్సెస్ ని ఒకరు ఎంజాయ్ చేస్తారు అనడానికి నిదర్శనం ఇదే. ఇకపోతే సితార ఇప్పటి స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తో ఉంది. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే , ఎంతమంది హీరోయిన్స్ కెరీర్స్ ముగుస్తుందో అని సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అందాలతో బంధించావా ’బంధవి‘

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన రాజమౌళి తో ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న 149 దేశాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అంతే కాకుండా రీసెంట్ గానే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ కి సంబంధించిన వీడియో ని కూడా మేకర్స్ విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version