https://oktelugu.com/

Employees : ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభవార్త!!

Employees ఈ బదిలీలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలో ఏళ్లుగా తిష్టవేసిన వారు బదిలీ కానున్నారు. దీంతో ఆ శాఖల ప్రక్షాళన జరుగనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 3, 2024 9:35 pm
    ఉద్యోగుల బదిలీలు

    ఉద్యోగుల బదిలీలు

    Follow us on

    Employees : తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆటంకం తొలగింది. ఆరేళ్ల తర్వాత బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జూలై 5 నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయనున్నారు.

    ఏళ్లుగా వినతి..
    ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగ సంఘాలు కూడా గతంలో ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి చేయలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు. దీంతో బదిలీల కోసం వేచి చూస్తున్న ఉద్యోగుల ఆశ నెరవేరలేదు.

    కొత్త ప్రభుత్వం రాకతో..
    తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టింది. బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగులకు వేతనాలు 10 తేదీ తర్వాతనే అందేవి. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆరు నెలలుగా ప్రతీనెల 1వ తేదీనే చెల్లిస్తోంది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ పనితీరుపై సంతృగా ఉన్నారు. ఈ క్రమంలో సాధారణ బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మంత్రులతోపాటు, ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో తాజాగా సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

    ఏళ్లుగా ఒకేచోట తిష్ట..
    రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగులు ఏళ్లుగా ఒకేచోట తిష్టవేశారు. సాధారణంగా రెండు లేదా మూడేళ్ల తర్వాత బదిలీలు చేపట్టాలి. కానీ, గత ప్రభుత్వం ఉద్యోగలు బదిలీలపై దృష్టిపెట్టలేదు. దీంతో ఆరేళ్లుగా తెలంగాణలో సాధారణ బదిలీలపై నిషేధం అమలవుతోంది. ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం బదిలీలకు అనుమతి ఇచ్చింది. కనిష్టంగా రెండేళ్లు గరిష్టంగా 5 దేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బదిలీలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలో ఏళ్లుగా తిష్టవేసిన వారు బదిలీ కానున్నారు. దీంతో ఆ శాఖల ప్రక్షాళన జరుగనుంది.