Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి విషయంలో అసంతృప్తిగా ఉన్న పవన్ కళ్యాణ్...కారణం ఏంటో తెలుసా..?

Chiranjeevi: చిరంజీవి విషయంలో అసంతృప్తిగా ఉన్న పవన్ కళ్యాణ్…కారణం ఏంటో తెలుసా..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండియాలో ఎవరికి సాధ్యం కానీ చాలా అరుదైన రికార్డులని తన ఖాతాలో వేసుకున్న ఒకే ఒక్కడు… మనం స్క్రీన్ పైన ఎలా కనిపిస్తే ప్రేక్షకుడి మనల్ని ఇష్టపడతాడు అని తెలుసుకొని వాళ్ళ అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేసి స్టార్ డమ్ ను అందుకున్న లెజెండరీ హీరో చిరంజీవి. ఇక చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి 2009 ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే అందులో కొన్ని సీట్లను దక్కించుకున్నప్పటికీ రాజకీయ ఎత్తుగడలను,రాజకీయ వ్యూహాలను తట్టుకొని అనవసరమైన బురదని తనకి అంటించుకునే ఉద్దేశ్యం లేకపోవడం వల్ల ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు.

ఇక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ చిరంజీవి విషయంలో కొంతవరకు అసహనం తో ఉన్నాడట…దేనికోసం అంటే ఆయన తనకంటే చిన్నవాళ్లు, తనతో ఏమాత్రం పోటీలో లేని వారి దగ్గర కూడా తగ్గి మాట్లాడాల్సి వస్తుందని, దానివల్లే చిరంజీవి విషయం లో పవన్ కళ్యాణ్ కొంతవరకు అసహనం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి సినిమా టికెట్ల ధరను తగ్గించిన సమయంలో చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలను డైరెక్టర్లను తీసుకొని ఇండస్ట్రీ తరపున మాట్లాడడానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. జగన్ కి చిరంజీవి దండం పెడుతూ మాట్లాడాడు.

కానీ జగన్ మాత్రం వెకిలి నవ్వు నవ్వుతూ కనిపించాడు. ఆ టైమ్ లో జగన్ చాలా విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ విషయం మాత్రం పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెడుతుందట. అసలు నిజంగా చెప్పాలంటే చిరంజీవికి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇండస్ట్రీ బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన ముందు అడుగు వేసి జగన్ ను కలవడానికి వెళ్తే ఆయన అలా అవహేళన చేసినట్టుగా చూడడం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడట.

దానివల్లే ఇక మీద ఏ విషయంలో అయిన మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చిరంజీవితో చెప్పారట. మిమ్మల్ని మీరు తగ్గించుకోని మాట్లాడాల్సిన అవసరం వస్తే మీరు అసలు మాట్లాడకండి అని కూడా చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి… ఇక మొత్తానికైతే చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కి ఎంత ఇష్టమో మరోసారి ప్రూవ్ అయింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version