why Balakrishna insisted on putting that dialogue in Simha movie
Balakrishna: నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు కూడా చెమటలు పట్టిస్తున్నాడనే చెప్పాలి. ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటితో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య పట్టుబట్టి మరీ ఒక డైలాగ్ పెట్టించారంట. అది ఏంటి అంటే “చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావ్” అంటూ వచ్చే డైలాగ్…ముందు రాసుకున్న సీన్ లో అయితే హీరో కామ్ గా వెళ్తుంటే, రౌడీ ఏదో కౌంటర్ వేస్తాడట. ఇక దానికి హీరో ఏమి పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.ఆ తర్వాత సీన్ లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించాలని దర్శకుడు అనుకున్నాడట.
కానీ బాలయ్య బాబు ఆ సీన్ పేపర్ చేసి హీరో అలా ఫోర్సు గా వెళ్తుంటే రౌడీలు కామెంట్ చేయడం హీరో కామ్ గా ఉండటం అక్కడికి సీన్ ఎండవడం అనేది అంతా పర్ఫెక్ట్ గా లేదు.
ఇక్కడ ఏదైనా బలమైన డైలాగ్ పడాలి అని బాలయ్య చెప్పారట. దాంతో బోయపాటి అప్పటికప్పుడు తన రైటర్స్ తో చర్చించుకొని ఈ డైలాగ్ ని రాసి సినిమాలో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డైలాగ్ కి థియేటర్ మొత్తం దద్దరిల్లిన విషయం మనకు తెలిసిందే.ఇక మొత్తానికైతే బాలయ్య వరుస ప్లాపుల నుంచి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమా కూడా వస్తుంది అది ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి…