అదే విధంగా ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. రీసెంట్ గానే ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ స్పీడ్ చూస్తుంటే సెప్టెంబర్ నెలలోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, పవన్ కళ్యాణ్ ఈ మూడు చిత్రాల తర్వాత చేయబోయే సినిమా పై మాత్రం స్పష్టమైన క్లారిటీ వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ప్రకటించి చాలా సంవత్సరాలు అయ్యింది. SRT ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం రెడీ గా ఉంది, పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తే అప్పటి నుండి షూటింగ్ మొదలు పెడుతామని నిర్మాత రామ్ తల్లూరి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
ఇది కూడా ఓజీ తరహాలోనే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ కాస్త నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చిందట, ఈ సినిమా చేస్తే ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ ఉండడం వల్ల అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనే సందేహాలు ఉండేవి. కానీ పవన్ ఇప్పుడు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది నవంబర్ నెలలో, లేదా జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ చిత్రం కూడా ఓజీ లాగా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటుందా లేదా అనేది