https://oktelugu.com/

Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !

Mahesh Babu About RRR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని రాజమౌళి నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల […]

Written By: , Updated On : March 24, 2022 / 10:00 PM IST
Follow us on

Mahesh Babu About RRR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని రాజమౌళి నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

Mahesh Babu About RRR

Mahesh Babu

ఈ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లోని ‘ఏఎంబీ మాల్’లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్ షో వేశారు. ఈ షోకి స్టార్ హీరోలతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వీక్షించారు. అనంతరం మహేష్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’తో తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు.

Also Read: IPL 2022 Tickets Online Booking: ఐపీఎల్ టికెట్లు కావాలా.. ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి..

నిజంగా ఇది రాజమౌళి విజువల్ డైరెక్షన్ కి ఓ కొలమానం. ఈ సినిమాతో ఎన్టీఆర్ నటనలో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. చరణ్ టెర్రిఫిక్ ఫెర్మామెన్స్ తో అబ్బురపరిచాడు. మనమందరం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశాం. మన ఎదురుచూపులకు ఫైనల్ గా బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.

మహేష్ – ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, గతంలో ఎన్నడూ ఇలా మహేష్.. ఒక సినిమాని ఇంత అద్భుతంగా పొగడలేదు. కానీ, మొదటసారి మహేష్ బాబు ఇలా ఓపెన్ అయిపోవడం మహేష్ ఫ్యాన్స్ ను కూడా షాక్ కి గురి చేసింది. మహేష్ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ.. హీరోలతో పాటు అజయ్ సర్, అలియా కూడా హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారని మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కీరవాణి అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉందని.. దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా టీమ్ కూడా అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా సముథ్రకని గారు కూడా అద్భుతంగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ కామెంట్స్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: RRR Movie Ignores Print Media: ఏంటిది జ‌క్క‌న్న‌.. ప్రింట్ మీడియా ఏం పాపం చేసింది.. ఎందుకీ వివ‌క్ష‌..?

Recommended Video:

RRR Telugu Movie Review || Jr NTR || Ram Charan || SS Rajamouli || Ok Telugu Entertainment

Tags