Pawan Kalyan Comments About Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో తనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఆయన చేస్తున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికినప్పుడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు ‘ అనే సినిమాని ఈనెల 24వ తేదీన ప్రేక్షక ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ఆయన మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని కూడా చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) నాకు అండగా ఉన్నాడని అలాంటి వ్యక్తి వల్లే మళ్ళీ సినిమాలు చేస్తూ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘ఓజీ’ స్లొగన్స్.. మండిపడ్డ పవన్!
మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉండి మనతో పాటు నిలబడే వాడే నిజమైన స్నేహితుడు అంటూ త్రివిక్రమ్ గురించి చాలా గొప్పగా చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం…వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలైతే వచ్చాయి. ఆ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గురించి తెలియజేస్తూ తన ఆత్మీయ మిత్రుడు అని, ఆత్మ బంధువు అని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా వస్తుందా లేదా అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.
కానీ అటు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు… ఇక మొత్తానికైతే హరిహర వీరమల్లు సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతోంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే…