Hari Hara Veeramallu Pre Release OG Slogans: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల ఆరేళ్ళ ఎదురు చూపులకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. ఆయన హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం భారీ అంచనాల నడుమ 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టాలను ఎదురుకొని ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు సిద్దమవ్వడం అభిమానుల్లో మామూలు ఉత్సాహం నింపలేదు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మొట్టమొదటిసారి ఆయన కేవలం తన అభిమానులకు మాత్రమే తన ప్రసంగాన్ని అంకితం చేస్తూ మాట్లాడాడు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదటి నుండి ఓజీ చిత్రమంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. స్పీచ్ తో మళ్లీ అదరగొట్టిన పవన్!
పవన్ కళ్యాణ్ రాజకీయ సభలకు వెళ్ళినప్పుడు కూడా ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేస్తుంటారు. ఆ సినిమా పై వారిలో అంతటి క్రేజ్ ఏర్పడింది. రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడకపోవడానికి కారణం కూడా ఓజీ నే. ఎందుకంటే ఆ చిత్రం సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. అంటే సరిగ్గా రెండు నెలల్లో అన్నమాట. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఓజీ చిత్రం పైనే తమ ఇష్టాన్ని చూపిస్తున్నారు. నిన్న ‘హరి హర వీరమల్లు’ ఈవెంట్ లో కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇస్తున్నప్పుడు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ కాస్త అసహనం వ్యక్తం చేసాడు. ‘ఓజీ..ఓజీ అని అరవడం కాదు,అది కూడా నా సినిమానే, కానీ ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా కోసం వచ్చాము. వీర..వీర అని అరవండి’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
అప్పుడు అందరు వీర..వీర అని అరవడం మొదలు పెట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మీరందరు ఓజీ చిత్రం కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. కానీ నేను హరి హర వీరమల్లు కి పడినంత కష్టం ఏ సినిమాకు పడలేదు. ఎంతో ఇష్టపడి చేసిన చిత్రమిది. మన చిన్నప్పుడు మొఘల్ రాజ్య పాలన గొప్పదనం గురించే చెప్పారు. వాళ్ళ నుండి వచ్చిన ఔరంగజేబు చేసిన అకృత్యాల గురించి ఎవ్వరూ చెప్పలేదు. ఈ సినిమాలో ఔరంగజేబు చేస్తున్న అకృత్యాల సమయంలో ఒక వ్యక్తి ఎదురు తిరిగి పోరాడితే ఎలా ఉంటుందో ‘హరి హర వీరమల్లు’ అనే ఫిక్షనల్ క్యారక్టర్ ద్వారా చూపించాము. చాలా అద్భుతంగా వచ్చింది, కేవలం ఒక్క క్లైమాక్స్ సన్నివేశం కోసమే 45 సమయం తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.