ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీలకంగా పని చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొందర్లోనే వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వకీల్‌సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిందీ హిట్ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. వేసవి లేదా దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. కరోనా దెబ్బకు ప్రణాళికలు అన్నీ తలకిందలయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత చిత్రీకరణ ఆగిపోగా.. వ్యాక్సిన్ వచ్చే వరకూ షూటింగ్ వద్దంటున్నాడు పవన్. దాంతో, ఈ మూవీ 2021లోనే విడుదల కానుంది.
Also Read: మళ్ళీ తెర పైకి ‘రామాయణం’.. కీలక పాత్రలో ఎన్టీఆర్ ?
ఈ లోపు తన తదుపరి చిత్రాలపై పవన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్, హరీశ్ శంకర్ తో ఒక్కో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పుడు మరిన్ని కథలు వింటున్నాడు. ఈ క్రమంలో మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ (ఏకే) రీమేక్‌పై పవన్ ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. దీనిపై తన మిత్రుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా తీసుకున్నాడట. ఈ మూవీ గురించి ఈ మధ్య పవన్, త్రివిక్రమ్ చర్చలు జరిగాయని సమచారం. ఏకే మూవీ చూసిన పవన్ స్టోరీ నచ్చడంతో రీమేక్‌లో నటించాలని అనుకున్నాడు. ఈ మూవీ రీమేక్ రైట్స్‌ను హారిక, హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నాయి. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.
Also Read: ‘బ్యాచ్‌లర్’ కష్టాలు.. నాగ్ ని ఎలా ఒప్పిస్తారో !
తొలుత ఈ రీమేక్‌లో రవితేజ, దగ్గుబాటి రానా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు పవన్ పేరు తెరపైకి వచ్చింది. పవర్ స్టార్ కూడా ఆసక్తిగా ఉండడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ, రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పుకోవడం లేదట. అయినప్పటికీ ఈ మూవీ చేసేందుకు పవన్ ఓకే చెబితే సరైన దర్శకుడిని వెతకాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇది మల్టీస్టారర్ మూవీ కావడంతో పవన్‌తో కలిసి నటించే మరో హీరోను కూడా వెతకాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఓకే అవుతుందో లేదో చూడాలి మరి.