ఏపీలో ప్రతిపక్షం ఖాళీ..!

రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనా.. ఇక ఆ పార్టీ ప్రతి పక్ష స్థానానికి పనికిరానంత దీన స్థితికి చేరుకుందా అంటే బీజేపీ నాయకులు అవునే చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. కేవలం 23 సీట్లే సాధించింది. వీరిలో ముగ్గురు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మరి కొందరు అదే బాటలో ఉన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ నాయకులు అలా మాట్లాడి ఉండవచ్చు. Also […]

Written By: Neelambaram, Updated On : August 11, 2020 8:29 pm
Follow us on


రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనా.. ఇక ఆ పార్టీ ప్రతి పక్ష స్థానానికి పనికిరానంత దీన స్థితికి చేరుకుందా అంటే బీజేపీ నాయకులు అవునే చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. కేవలం 23 సీట్లే సాధించింది. వీరిలో ముగ్గురు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మరి కొందరు అదే బాటలో ఉన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ నాయకులు అలా మాట్లాడి ఉండవచ్చు.

Also Read: బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని సూచించారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి వచ్చే నాలుగేళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

మరోవైపు బీజేపీలోకి టీడీపీ, వైసీపీ నుంచి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల వెల్లడించారు. ధీంతో ఆ పార్టీలో కాన్ఫెడెన్స్ లెవల్స్ బాగా పెరినట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2024 నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము ప్రకటించారు.

Also Read: వైసీపీ కి షాక్..? రాజధాని విషయంలో చివరికి వెనక్కి తగ్గిన జగన్..!

టీడీపీ పరిస్థితి బీజేపీ నేతలు చెబుతున్న అంత దీనంగా లేదు. టీడీపీ నాయకులు పార్టీని వీడినా క్షేత్ర స్ధాయిలో క్యాడర్ టిడిపి ఉంది. బీజేపీకి క్యాడర్ లేదు. అందుకే 2014 ఎన్నికల్లో టిడిపి పొత్తుతో నాలుగు సీట్లు సాధించినా, గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. క్యాడర్ లేకుండా నాయకులు ఉన్నంత మాత్రాన పార్టీ భలం ఉండదు. బీజేపీ అధికారంపై దృష్టి తగ్గించి ముందు పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసి క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంటే అధికారం సాధించడం సాధ్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి ఇది అంత తేలికైన పని కాదు. అదే విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చెప్పారు. రోడ్లపైకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. మరి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తారో చూద్దాం.