https://oktelugu.com/

మహేశ్‌తో సినిమాపై రాజమౌళి సైలెన్స్‌ ఎందుకంటే..

బాహుబలి 1,2 తర్వాత కొంత విరామం తీసుకున్న దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ, పరిస్థితి చూస్తుంటే 2021 చివరి వరకూ కూడా వచ్చేలా లేదు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. గత నెలలో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని అనుకున్నా.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ లోపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 11, 2020 7:22 pm
    Follow us on


    బాహుబలి 1,2 తర్వాత కొంత విరామం తీసుకున్న దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ, పరిస్థితి చూస్తుంటే 2021 చివరి వరకూ కూడా వచ్చేలా లేదు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. గత నెలలో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని అనుకున్నా.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ లోపు రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని తమ ఫామ్‌హౌజ్‌లో వాళ్లంతా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండి కోలుకుంటున్నారు. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. దాంతో, తన తదుపరి ప్రాజెక్టుపై రాజమౌళి దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

    Also Read: నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !

    ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్‌ బాబుతో సినిమా చేస్తానని ఈ స్టార్ డైరెక్టర్ కొన్ని నెలల కిందటే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహేశ్‌ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ నెల 9వ తేదీన రాజమౌళి- మహేశ్‌ మూవీ గురించి ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, సర్కారు వారి పాట టైటిల్‌ ట్రాక్ టీజర్ మాత్రమే రాగా… రాజమౌళి వైపు నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఫ్యాన్స్‌ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే, మహేశ్‌ మూవీపై రాజమౌళి కావాలనే సైలెన్స్‌ మెయింటేన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది., రిలీజయ్యేందుకు కనీసం ఏడాది సమయం పట్టనుంది. ఆ చిత్రం షూటింగ్ అయినా కంప్లీట్‌ కాకముందే మహేశ్‌ మూవీ గురించి అధికారిక ప్రకటన చేయకూడదని రాజమౌళి నిర్ణయానికి వచ్చేశాడట. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాతే కొత్త ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలని భావిస్తున్నాడట. పైగా, మహేశ్‌తో మూవీ పట్టాలెక్కినా షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌ చేసేందుకు ఎంతలేదన్నా మరో రెండు మూడేళ్లయినా పడుతుంది. అందువల్ల ఇప్పటినుంచే సినిమా గురించి మాట్లాడి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచి, వారిని ఎదురు చూసేలా చేయడం మంచిది కాదని రాజమౌళి భావిస్తున్నాడట.