Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… ఆయన చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఖుషి సినిమాతో మొదటి ఇండస్ట్రీ అందుకున్న ఆయన ఆ సినిమాతో భారీ రికార్డులను కూడా కొలగొట్టాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలను సైతం ఇండస్ట్రీ హిట్టుగా మార్చాలనే ప్రయత్నం చేశాడు…త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘జల్సా’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?
ఇక పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ హిట్ కొడతానని త్రివిక్రమ్ ఛాలెంజ్ చేశారట. అసలు మేటర్ లోకి వెళ్తే ‘అత్తారింటికి దారేది’ సినిమా కథని రెడీ చేసుకున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంతమంది ప్రొడ్యూసర్స్ కైతే ఆ కథను వినిపించారట. ప్రొడ్యూసర్స్ అది విని పవన్ కళ్యాణ్ కి ఈ మూవీ అస్సలు సెట్ అవ్వదు. ఇది వేరే ఒక సాఫ్ట్ హీరోకి అయితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేశారట.
అయినప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఎక్కడా తగ్గకుండా పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపిస్తానని చెప్పారట. ఇక త్రివిక్రమ్ శపథం చేసిన ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు అనే విషయాలను బయట పెట్టలేదు. కానీ మొత్తానికైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మొత్తానికైతే త్రివిక్రమ్ తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టాడు.
మొత్తానికైతే తను చాలెంజ్ చేయడం ఒకెత్తయితే పవన్ కళ్యాణ్ సైతం ఆ క్యారెక్టర్స్ ని ఓన్ చేసుకొని త్రివిక్రమ్ మీద ఎంత ప్రెజర్ ఉందో అర్థం చేసుకొని మరి సినిమా చేశాడు. అందువల్లే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పటికి ఆ సినిమా టీవీలో వస్తే చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ మొదటిసారి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు…
