Unstoppable 4: ఇండియా లోనే మోస్ట్ పాపులర్ టాక్ షోస్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఇప్పటి వరకు మూడు సీజన్స్ ని పూర్తి చేసుకొని, ఈ నెల 24 వ తారీఖు నుండి నాల్గవ సీజన్ ని ప్రారంభించుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు. తదుపరి ఎపిసోడ్ కి ఐశ్వర్య రాయ్ వస్తుందనే వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదంతా పక్కన పెడితే ఆహా మీడియా టీం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను కలిపి ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్ వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసాడట. ఇద్దరు కలిసి వచ్చేందుకు అంగీకరించారు.
తేదీని ప్లాన్ చేసి చెప్పండి, ఆ రోజు షెడ్యూల్స్ ని చూసుకొని డేట్స్ ఇస్తామని చెప్పారట పవన్ కళ్యాణ్, చంద్రబాబు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. రెండవ సీజన్ లోని ప్రారంభ ఎపిసోడ్ చంద్రబాబు తోనే మొదలైంది. ఈ ఎపిసోడ్ కి నారా లోకేష్ కూడా విచ్చేశాడు. వీళ్లిద్దరు కలిసి బాలయ్య తో జరిపిన సంభాషణ చూసేందుకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చివరి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ని పిలిచారు. పవన్ కళ్యాణ్, బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్ చాట్ అప్పట్లో మెగా, నందమూరి అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చింది. ఈ ఎపిసోడ్ కి అన్ని ఎపిసోడ్స్ కంటే అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు కలిసి ఒకే ఎపిసోడ్ లో బాలయ్య బాబుతో చిట్ చాట్ చేయబోతున్నారు.
ఇక ఈ ఎపిసోడ్ కి ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి అయిన సందర్భంగా , ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కష్ట సమయంలో ఒకరి కోసం ఒకరు నిలబడిన తీరు, వీటి గురించి ఈ టాక్ షో లో ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్, చంద్ర బాబు మధ్య ఉన్న స్నేహ బంధం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా ఆద్యంతం సరదాగా, ఆలోచింపచేసే విధంగా ఈ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈ ఎపిసోడ్, సీజన్ చివర్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. బాలయ్య, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయిక లో రాబోతున్న ఈ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని ఆహా టీం ఆశిస్తుంది.