https://oktelugu.com/

Virat Kohli: టెస్టుల్లో ఆ నంబర్ విరాట్ కోహ్లీకి కలిసి రావడం లేదా..?

టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ 16 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ బాట పట్టాడు.

Written By:
  • Mahi
  • , Updated On : October 17, 2024 3:58 pm
    Virat Kohli(1)

    Virat Kohli(1)

    Follow us on

    Virat Kohli: భారత్-న్యూజిలాండ్ ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఎట్టకేలకు నేటి నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 16న మొదటి రోజు జరగాల్సిన మ్యాచ్ రోజంతా వర్షం కురువడంతో టాస్ కూడా పడలేదు. రెండో రోజు బెంగళూరులో వాతావరణం అనుకూలంగా ఉండడంతో సమయానికి టాస్‌ వేశారు. కాగా, టీమిండియా బ్యాటింగ్‌కు దిగిన కొద్దిసేపటి కే వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. భారత జట్టు 46 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ 34 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇందులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. టెస్టు క్రికెట్‌లో భారత గడ్డపై టీమిండియా అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. 20 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ భారత జట్టులో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేశాడు.
    ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీ కూడా ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే విరాట్ కోహ్లీకి మూడో స్థానం కలిసి రావడం లేదనే చర్చ జరుగుతన్నది. ఇప్పటి వరకు మూడో నంబర్‌లో బ్యాటింగ్ వచ్చిన ప్రతీసారి కోహ్లీ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.

    టీమ్ ఇండియాకు షాకిచ్చిన న్యూజిలాండ్
    టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ 16 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారింది. మెడ బిగుసుకుపోవడం వల్ల శుభ్‌మాన్ గిల్ ఈరోజు మ్యాచ్ ఆడడం లేదు. దీంతో విరాట్ కోహ్లీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే కోహ్లీ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందిస్తాడని అంతా భావించారు. కానీ కోహ్లీ 9 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు.

    కలిసి రాని మూడో స్థానం
    విరాట్ కోహ్లీకి సుధీర్ఘ కాలంగా టెస్టు మ్యాచ్ లు ఆడుతున్నాడు. కోహ్లీ ఎక్కువగా నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మూడో స్థానంలో ఆడేందుకు వచ్చిన ప్రతీసారి బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు. టెస్టుల్లో 29 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లి.. టెస్టు క్రికెట్‌లో నాలుగో ర్యాంక్‌లో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో కోహ్లీని మూడో స్థానంలో పంపడంలో నిర్ణయం ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక కోచ్ కోహ్లీని మూడో స్థానంలో పంపాడా? విరాట్ కోహ్లి స్వయంగా వచ్చి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతానని కోరాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
    విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఎప్పుడడూ విఫలమవుతూనే ఉన్నాడు. ఈ స్థానంలో కోహ్లీ ఇప్పటి వరకు హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

    టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన సమయంలో కోహ్లీ సగటు కేవలం 16.16 మాత్రమే. బౌలర్‌కి కూడా ఇంతకంటే ఎక్కువ సగటు ఉంటుంది. అయితే కోహ్లీ ఈ సగటుతో సంతోషంగా ఉండలేడు. ఇప్పటి వరకు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన సమయంలో కోహ్లీ అత్యధిక స్కోరు కేవలం 41 పరుగులు మాత్రమే. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ తో నేటి ఇన్నింగ్స్‌ను కూడా కలుపుకుంటే, కోహ్లీ ఇప్పటివరకు ఏడుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. విరాట్ కోహ్లి గతంలో టెస్టులో 32 ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు.