https://oktelugu.com/

పవన్ ఫ్యాన్ ను కెలికిన దేవి నాగవల్లి.. ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో తొలిరోజు నుంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్న దేవి నాగవల్లి ఊహించని విధంగా మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దేవి తప్పు లేకపోయినా వివిధ కారణాల వల్ల ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బయటకు వచ్చిన దేవి నాగవల్లి ఇప్పటికే తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 30, 2020 / 05:23 PM IST

    shocked to know these things about TV9 Devi

    Follow us on

    బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో తొలిరోజు నుంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్న దేవి నాగవల్లి ఊహించని విధంగా మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దేవి తప్పు లేకపోయినా వివిధ కారణాల వల్ల ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బయటకు వచ్చిన దేవి నాగవల్లి ఇప్పటికే తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

    Also Read : అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

    మరోవైపు దేవి ప్రముఖ ఛానల్ లో యాంకర్ కావడం వల్లే ఎలిమినేషన్ జరిగిందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో టీవీ9 ఛానల్ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పని చేసింది. టీవీ9 ఛానల్ వార్తల వల్లే పార్టీకి నష్టం కలిగిందని భావించి సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

    దీంతో ఈ ప్రచారం గురించి దేవి స్పందించి వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ గేమ్ పరంగా తాను ఓడిపోయినప్పటికీ వ్యక్తిత్వం పరంగా తాను విన్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. తనకు ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేయడంతో తాను బలైపోయానని ఆమె వెల్లడించారు. తాను ఎలిమినేషన్ అయ్యానని తెలిసిన వెంటనే చాలా బాధగా అనిపించిందని దేవి చెప్పారు. ఎలిమినేట్ చేయడం ద్వారా తనకు శిక్షించినట్టు అనిపించినా బాధ పడేది మీరేనని పవన్ ఫ్యాన్స్ కు చెప్పారు.

    బిగ్ బాస్ హౌస్ వాళ్లు ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలని కోరగా తాను దాసరి మనవరాలినని చెప్పారని.. తన తల్లి కూడా ఇంటర్వ్యూలలో ఈ విషయం వెల్లడించిందని పేర్కొన్నారు. పవన్ ఫ్యాన్స్ పేరు పైకి ప్రస్తావించకపోయినా వాళ్లే రియలైజ్ అవుతారంటూ దేవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Also Read : చిరంజీవి, అల్లు అర్జున్ లను నక్సలైట్లుగా మారుస్తున్న కొరటాల?