Pawan Kalyan Fans: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. ఫ్యాన్స్ అందు పవన్ ఫ్యాన్స్ వేరయా అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే పవన్ కల్యాణ్ కు ఉన్నంత పిచ్చి అభిమానులు టాలీవుడ్‌లో మరే హీరోకు ఉండరు. ఆయన ఒక్క స్పీచ్ ఇస్తేనే ఆహా ఓహో అంటూ గెంతులేసే అభిమానులకు.. ఆయన సినిమా రిలీజ్ అయితే పెద్ద పండగే అవుతుంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన భీమ్లా నాయక్ విషయంలో మాత్రం ప్యాన్స్ అతిగా ఆవేశ పడిపోతున్నారని అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే సినిమాను రాజకీయాలకు అన్వయిస్తున్నారు. ఒక సినిమా బాగుంటే బాగుందని, లేదంటే లేదని చెప్తే సరిపోతుంది. కానీ భీమ్లానాయక్ విషయంలో మాత్రం బాగుంది అనే చెప్పాలి తప్ప.. బాగో లేదని చెప్పొద్దు అన్నట్టే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఎవరైనా బాగా లేదని చెప్తే వారిని వైసీపీ సానుభూతిపరులు అన్న ముద్ర వేసేస్తున్నారు.
మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు బాగో లేదన్న వారి మీద ఇలాంటి ముద్రలే వేశారు పవన్ ఫ్యాన్స్. ఇదే ఇక్కడ సినీ-రాజకీయ రగడను పుట్టిస్తోంది. వాస్తవానికి సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదు. ఎంత గొప్ప సినిమాను అయితే తిట్టే వారు సహజంగానే ఉంటారు. అలా అని సినిమా బాగోలేదని కాదు. కానీ భీమ్లానాయక్ విషయంలో విమర్శలు రావొద్దంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read: Chiranjeevi on Bheemla Nayak: భీమ్లానాయక్ ఇబ్బందులపై చిరంజీవి మౌనం దేనికి కారణం..?
పోనీ మూవీ ఏమైనా అంత గొప్పగా ఉందా అంటే.. అయ్యప్పనుమ్ కోశియమ్ అంత లేదనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కోసం కథలో మార్పులు చేసి పవన్ సినిమా అన్నట్టు తీశారు. పైగా చాలా సీన్లలో అతి ఎక్కువ అయిందని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇది పైకి చెప్తే మాత్రం నో అంటున్నారు అభిమానులు. ఇక తమ హీరో సినిమా హిట్ అయిపోయింది కాబట్టి జనసేన బలం పెరిగిందంటూ కితాబు ఇచ్చేస్తుననారు.
పైగా పవన్ సీఎం, సీఎం అంటూ థియేటర్లలో ఇటు రోడ్ల మీద పెద్ద నినాదాలు, ర్యాలీలు తీస్తున్నారు. అఖండ విషయంలో ఇలాగే రాజకీయాలకు ముడి పెడిత అంత పెద్ద హిట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒక సినిమాను అన్ని వర్గాల వారు ఆదరిస్తేనే పెద్ద హిట్ అవుతుంది. ఆ విషయాన్ని పవన్ అభిమానులు మర్చిపోయి తమ అధినేతను ఒక వర్గానికే పరిమితం చేస్తున్నారు.
Also Read: Bheemla Nayak: ఆంధ్రా నడిబొడ్డున జగన్ కు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్.. ‘థాంక్యూ సీఎం సార్’ వైరల్