Bheemla Nayak Team Party: ఎప్పటి నుంచో ఊరించి చివరకు థియేటర్లలోకి వచ్చి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది భీమ్లానాయక్ మూవీ. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అసలే పవన్ మూవీ కావడంతో కామన్ గానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో మూవీ ఎలా ఉండబోతోందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు.

చివరకు వారి అంచనాలు నిజమయ్యాయి. మూవీ హిట్ అయింది. ఇంకేముంది ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఎక్కడ చూసినా భీమ్లానాయక్ ఫీవర్ పట్టుకునేలా చేశారు. ఎన్నో రూమర్లు, ఎన్నో వివాదాల నడుమ వచ్చిన భీమ్లానాయక్ సక్సెస్ కావడంతో.. మూవీ టీమ్ శనివారం ఉదయం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ థాంక్స్ చెప్పారు.

Also Read: Bheemla Nayak : ఇంతకీ ‘భీమ్లానాయక్’ క్రెడిట్ ఎవరిది?
అయితే ఈ సక్సెస్ మీట్ లో పవన్ పాల్గొనలేదు. కానీ నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో పవన్, త్రివిక్రమ్ కలిసి ఓ గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఇందులో మూవీకి పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు, సింగర్లు, ఆర్ట్ డైరెక్టర్లు ఇలా అందరూ పాల్గొని పార్టీని ఎంజాయ్ చేశారు. ఇందులో పవన్ లుక్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయిపోయాయి.
పవన్ ఇలా పార్టీలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఎన్నో అడ్డంకులను దాటుకుని విజయం సాధించిందనే సంతోషమో ఏమో తెలియదు గానీ.. పవన్ కూడా ఈ మూవీ రిజల్ట్ పట్ల చాలా కుషీగా ఉన్నారంట. మొత్తానికి త్రివిక్రమ్ మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకున్నారని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. యంగ్ డైరెక్టర్ సాగర్‌కు ఇక తిరుగుండదని చెబుతున్నారు.
Also Read: Chiranjeevi on Bheemla Nayak: భీమ్లానాయక్ ఇబ్బందులపై చిరంజీవి మౌనం దేనికి కారణం..?
[…] […]
[…] Also Read: Bheemla Nayak Team Party: భీమ్లానాయక్ టీమ్‌కు అదిరి… […]
[…] […]
[…] Balakrishna Wedding Card: అదేంటో గానీ.. బాలయ్య వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత జోష్ లో కనిపిస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో మూవీలను లైన్ లో పెట్టేస్తున్నాడు. అఖండతో కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. ఇదే ఊపులో వరుసగా పెద్ద మూవీలను ఓకే చేశాడు. అఖండతో నందమూరి అభిమానుల కలను కూడా తీర్చేశాడు. ఈ మూవీ ఏకంగా వందకోట్ల మార్కును క్రాస్ చేసింది. […]