Kodali Nani comments on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో సినిమాల విషయంలో రగడ రాజుకుంటూనే ఉంది. సినిమాల టికెట్ల వ్యవహారంపై చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు సీఎం జగన్ ను కలిసినా ప్రయోజనం శూన్యమే. సీఎం సానుకూలంగా స్పందించారని మీడియా ముఖంగా చెప్పినా ప్రభుత్వంలో మాత్రం స్పందన మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ పై కూడా ప్రస్తుతం ప్రభుత్వం, పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
భీమ్లా నాయక్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. సాక్షాత్తు మంత్రి తమ్ముడికి కూడా టికెట్ల విషయంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. అలాంటిది పవన్ కల్యాణ్ సినిమాకు ఎందుకు ప్రత్యేకత అని సెలవిస్తున్నారు. సినిమాల విషయంలో గతంలోనే పవన్ కల్యాణ్ విమర్శలు చేయగా ఎవరు కూడా ఆయనకు మద్దతు పలకలేదు.
Also Read: నాగబాబుపై రోజా సెటైర్లు.. భీమ్లా నాయక్‌ను ప్రభుత్వం తొక్కేయలేదంట..!
దీంతో టికెట్ల గోల కాస్త అందరికి నష్టమే కలిగించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా ఎదుగుదల ప్రశ్నార్థకంలో పడనుంది. పక్కనున్న రాష్ట్రం తెలంగాణలో సినిమాలకు వరాలు ప్రకటిస్తుంటే ఏపీలో మాత్రం సినిమాల మనుగడ సాధించకుండా చేయడం తెలుస్తోంది. దీంతో సినిమాల విషయంలో మంత్రి నాని చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ప్రజల సౌకర్యార్థమే టికెట్ల ధరలు తగ్గించినట్లు చెబుతోంది. కానీ రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా ఒక్క సినిమానే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పగ సాధించినట్లు చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. పవన్ కల్యాణ్ సినిమాపై మంత్రి కొడాలి నాని మాటలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున హీరోగా వచ్చిన బంగార్రాజు సినిమాకు కూడా ఇదే విధానాన్ని అవలంభించామని చెబుతున్నారు.
Also Read: భీమ్లానాయక్ అవకాశాన్ని వాడేస్తున్న టీడీపీ.. ఆ భయంతో బీజేపీ కూడా..!