Game Changer Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోకపోవడం పై మెగా అభిమానుల్లో తీవ్రమైన నిరాశ నెలకొంది. ఈ సినిమాకి ఎందుకు అంత నెగటివ్ టాక్ వచ్చింది అని ఇప్పుడు పోస్టుమార్టుమ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, అభిమానులు ఎప్పటికీ చిరకాలం తమ మనస్సులో పదిలపర్చుకునే రేంజ్ ఉపన్యాసాన్ని అందించాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందు కమెడియన్ పృథ్వీ వైసీపీ పార్టీ ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వైసీపీ పార్టీ అభిమానులు దీనికి ట్రిగ్గర్ అయ్యి ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని బ్యాన్ చేస్తాము అంటూ పెద్ద ఎత్తున క్యాంపైన్స్ నిర్వహించారు.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా జగన్ ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం వైసీపీ పార్టీ అభిమానులకు అసలు నచ్చలేదు. అనేక ప్రాంతాలలో మెగా అభిమానుల్లోనూ వైసీపీ పార్టీ అభిమానులు ఉన్నారు. వాళ్లంతా ఈ సినిమాని బ్యాన్ చేసారని, ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లనే జరిగిందని చిరంజీవి ఫోటో పెట్టుకున్న కొంతమంది వైసీపీ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గత పదేళ్ల పై నుండి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ గ్యాప్ లో ఆయన ఎన్నో సినిమాలు చేసాడు. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ లో రీమేక్ సినిమాలను అసలు పట్టించుకోవడం లేదు. అలాంటి రీమేక్ సినిమాలతోనే పవన్ కళ్యాణ్ ఓపెనింగ్స్ లో రికార్డ్స్ పెడుతున్నాడు. అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కనీసం వారం రోజులు అదిరిపోయే కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నాడు.
మరి అతనికి వచ్చిన వసూళ్లు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఎందుకు రావడం లేదు?, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకరు బ్యాన్ చేస్తే బ్యాన్ అయ్యింది అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ జరగలేదు. బాగున్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు, బాగాలేని సినిమాకి ఎన్ని కారణాలు చెప్పినా వృధానే. గేమ్ చేంజర్ చిత్రానికి పబ్లిక్ గా చాలా నెగటివ్ టాక్ వచ్చింది. దానికంటే సంక్రాంతికి విడుదలైన ఇతర సీనియర్ హీరోల సినిమాలు అద్భుతంగా ఉన్నాయని టాక్ రావడంతో గేమ్ చేంజర్ వసూళ్లు భారీగా పడిపోయాయి. అంతే కానీ , వైసీపీ పార్టీ వాళ్ళు బ్యాన్ చేసారని, పవన్ కళ్యాణ్ జగన్ ని టార్గెట్ చేయడం వల్ల వైసీపీ పార్టీ వాళ్ళు నొచ్చుకొని సినిమా చూడడం ఆపేసారు అనేది పూర్తిగా కల్పిత కథనే. కాబట్టి ఇలా ఒకరిని ఒకరు నిందించుకోవడం సరికాదని విశ్లేషకుల అభిప్రాయం.