Women : పీరియడ్స్ సమస్యను ప్రతి మహిళ ఎదుర్కుంటుంది. ఈ సమస్య వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు కూడా. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలో బాధ పెతుంటాయి. ఇవి మాత్రమే కాదు కొందరికీ వారి శరీరాన్ని బట్టి మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇక రోజు వారి జీవన శైలి, ఆహారం వంటివి కూడా ప్రస్తుతం ఈ పీరియడ్స్ ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రిమెన్ స్ట్రిల్ సిండ్రోమ్ (pms)అనేది స్త్రీ రుతు చక్రం ముందు తరుచుగా కనిపించే పీరియడ్ లక్షణాలు. ఈ సమస్యతో బాధ పడుతుంటే మానసిక కల్లోలం, రొమ్ము నొప్పి, అలసట, చికాకు వంటి అనేక శారీరక లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో కొంతమంది మహిళకు పీరియడ్స్ కు ముందు నిద్ర సమస్య తో పోరాడుతుంటారు. దీని వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యలు pms కి సంబంధించినవి అంటున్నారు నిపుణులు.
మహిళలు ఈ సమస్య లక్షణాలు ఎలా తెలుసుకోవాలి ?
Pms సమస్య తో బాధపడే వారి శరీరంలో చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఋతుస్రవం అవుతున్న చాలా మంది మహిళలకు pms చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఇది వారి నెలసరి టైమ్ కంటే ముందు అంటే వారం లేదా రెండు వారాలలో ముందే వస్తుంది. 90%కంటే ఎక్కవ మందిని ప్రభావితం చేస్తుంది ఈ సమస్య. క్లినికల్ ఎపిడెమియాలజీ, గ్లో బల్ హెల్త్ లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం 75% స్త్రీలు ఈ ఋతుస్రావం వివిధ రకాల pms తో బాధపడుతూ 3-8% తీవ్రమైన లక్షణాలను కలిగి ఉన్నారు.
మూడ్ స్వింగ్స్
న్యూఢిల్లీలోని నర్చర్ lvf క్లినిక్, గైనకాలజిస్ట్, lvf నిపుణులు డాక్టర్ అర్చన ధావన్ బజాజ్ సర్వే ప్రకారం, pms లక్షణాలు తరుచుగా ఉబ్బరం, రొమ్ము నొప్పి, ఇంకా ప్రైవేట్ భాగాలు లేదా కండరాలలో నొప్పిని కలిగి ఉంటాయన్నారు. ఇవి స్త్రీల నిద్ర లేమికి కారణమవుతాయి అన్నారు.
నిద్ర లేకపోవడానికి, pms కు మధ్య సంబంధం:-
నిద్ర లేమి కారణంగా ప్రజలు తగినంత నిద్ర పొందలేరు . నిద్ర లేకపోతే రోజూ వారి జీవనశైలి బాగా ప్రభావితమవుతుంది. స్కాలర్స్ జనరల్ ఆఫ్ అప్లైడ్ మెడికల్ సైన్సెస్ (sjams)లో ప్రచురించిన 2017 అధ్యయనంలో 17 నుంచి 22 సంవత్సరాల వయస్సు గల 194 మంది పాల్గొన్నారు. వారిలో 20%మంది నిద్రలేమి తో పాటు pms ని అనుభవిస్తున్నట్లు తేలింది. కడుపు నొప్పి, అలసట, మానసిక అశాంతి, ఆందోళన, చిరాకు వంటి కొన్ని సాధారణ లక్షణాలు pms సంబంధించినవిగా పరిశోధనలో తేలిందని వివరించారు.