https://oktelugu.com/

Pawan Kalyan: మెగాస్టార్ చేసిన ఆ సినిమాలో కొన్ని సీన్స్ ను ఎడిట్ చేసిన పవన్ కళ్యాణ్…ఆ సినిమా ఏంటంటే..?

చిరంజీవి వరుస సినిమాలు చేయడమే కాకుండా ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకి నచ్చుతాయి అని తన ఫ్యాన్స్ ని కొంతమంది ని పిలిపించుకొని మరి వాళ్ల అభిరుచులను తెలుసుకొని వాళ్లకు నచ్చే సినిమాలు చేయడంలో చిరంజీవి మొదటి...

Written By:
  • Gopi
  • , Updated On : March 1, 2024 / 03:49 PM IST
    Follow us on

    Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఎన్టీఆర్(NTR) తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో చిరంజీవి చాలా వరకు ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీ కూడా 90 వ దశకం లో మన సినిమాల వైపు చూసింది అంటే అది కేవలం చిరంజీవి చేసిన సినిమాల వల్లే అని చెప్పవచ్చు. ఇక అలాంటి చిరంజీవి వరుస సినిమాలు చేయడమే కాకుండా ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకి నచ్చుతాయి అని తన ఫ్యాన్స్ ని కొంతమంది ని పిలిపించుకొని మరి వాళ్ల అభిరుచులను తెలుసుకొని వాళ్లకు నచ్చే సినిమాలు చేయడంలో చిరంజీవి మొదటి నుంచి సక్సెస్ అవుతూ వస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేసిన హిట్లర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సీన్ ను ఎడిట్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. అది ఏంటి అంటే సిస్టర్ సెంటిమెంట్ తో సాగే ఈ సినిమాలో రంభ చిరంజీవి మధ్య ఒక రొమాంటిక్ సీన్ ఉందట…అది సినిమా మూడ్ ను దెబ్బతీసే విధంగా ఉందని ఈ సినిమా ప్రివ్యూ చూసిన పవన్ కళ్యాణ్ చిరంజీవికి చెప్పడంతో చిరంజీవికి కూడా అదే ఫీలింగ్ కలిగిందట.

    ఇక దాంతో ముత్యాల సుబ్బయ్య తో చెప్పి ఆ సీన్ ని సినిమాలో నుంచి తీసేశారు. ఇక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అంతకు ముందు వరుసగా చిరంజీవి వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగాడు. ఇక పవన్ కళ్యాణ్ ఆ సీన్ ను జడ్జ్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. తను అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు.

    ఇక అలాంటి సమయంలో ఆ సీన్ ను ఎడిట్ చేయమని చెప్పడం ఆయనకు సినిమా మీద ఎంత నాలెడ్జ్ ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ తో చిరంజీవికి అర్థమైందట. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన కూడా పవర్ స్టార్ గా ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి…