Pawan Kalyan directors controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేలేచేస్తున్నారు. వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం గత 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించిన ఆయన జానీ సినిమా నుంచి వరస ప్లాప్ లను మూట గట్టుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాతో తనదైన శైలిలో విజృంభించిన ఆయన ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆయన మాత్రం కొంతమందితోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ ను సాధించబోతున్నాయి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కాంపౌండ్ లో ఒక ఇద్దరు డైరెక్టర్లను మాత్రం అడుగుపెట్టినవ్వడం లేదంట. కారణం ఏంటి అంటే వాళ్లు గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని వేరే హీరోలతో సినిమాలు చేశారు. అందువల్ల ఆయన వాళ్ళని తన కాంపౌండ్ లోకి అడుగుపెట్టినవ్వడం లేదంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అందులో మొదట ఎస్ జే సూర్య గురించి చెప్పుకోవాలి. ఎస్.జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఖుషి, పులి లాంటి రెండు సినిమాలు వచ్చాయి.
అందులో ఖుషి బ్లాక్ బస్టర్ కాగా, పులి డిజాస్టర్ గా మారింది. ఇక ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాల్సింది. ఎస్ జే సూర్య కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ గా చేసే అవకాశం దొరకడం తో అంత పెద్ద పాత్ర తనకి వచ్చిందని సినిమాని కరెక్ట్ చేయడానికి వెళ్ళాడు.
దాంతో పవన్ కళ్యాణ్ కొంతవరకు కోపానికి గురైనట్టుకే తెలుస్తుంది. ఇక డాలీ డైరెక్షన్ లో ‘కాటమ రాయుడు’ అనే సినిమా చేశారు. ఇంకా ఆ తర్వాత సూర్య పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించిన కూడా అది వర్కౌట్ కాలేదట…ఇక సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత సముద్ర ఖని తో మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించినప్పటికి సముద్ర ఖని మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదట.
దాంతో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ సముద్ర ఖని కూడా తన కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వకూడదనే కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో డేట్స్ ఇచ్చినప్పుడు సినిమాలు చేసుకోవాలి గాని ఇలా మధ్యలో వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…