Pawan Kalyan on Ustaad Bhagat Singh: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్న కూడా మనలో టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేము…ఇప్పటికే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు ఇక్కడ సక్సెస్ అవ్వలేక ఫేడ్ అవుట్ అయ్యారు…ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం మెగాస్టార్ తమ్ముడిగా వచ్చి తనకంటూ ఒక మార్కు ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 19వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ ని పవన్ కళ్యాణ్ చూశారట.
ఈ సినిమా మీద ఆయన కొంతవరకు నిరాశ ను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఏమైనా డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ హరీష్ శంకర్ తో చర్చించారట. కానీ దానికి హరీష్ శంకర్ నుంచి వచ్చిన సమాధానాన్ని చూసి పవన్ సంతృప్తి చెందినట్టుగా తెలుస్తుంది…
Also Read: సీనియర్ హీరోలందరు మల్టీ స్టారర్ వెంట పడుతున్నారా..?
ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న ఈ సినిమా వండర్స్ ను క్రియేట్ చేస్తుందంటూ చాలా మంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఓజీ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…
ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఒక స్టైల్ లో ఉంటే ఇప్పటినుంచి రాబోతున్న సినిమాలు మరొక వెర్షన్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ నుంచి ఒక సినిమా వస్తే మాత్రం అది పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ మూవీ ఎంతటి కలెక్షన్స్ ను రాబడుతోందనేది తెలియాల్సి ఉంది…