Pawan Kalyan Fan: అంతు లేని అభిమానం..సినిమా చూసే శక్తి ఒంట్లో లేదు..కానీ మా అభిమాన హీరోని వెండితెర పై చూడాలనే ఆరాటం. తన చెల్లి ఆశని చూసి తన చేతుల మీదుగా థియేటర్ కి తీసుకొచ్చి అన్నయ్య చూపించడం. ఈ అరుదైన ఘటన నిన్న ఒక థియేటర్ లో చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతంతా బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి అంతులేని అభిమానం ని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లెక్కలేనంతగా సొంతం చేసుకున్నాడని,ఇలాంటి వాళ్ళు ఆయనకు కోట్లలో అభిమానులు ఉన్నారని, అందుకే ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చినా సినిమా కనీసం వీకెండ్ వాకు అయినా భారీ వసూళ్లను రాబట్టగలుగుతుందని అంటున్నారు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సినిమాని చూసిన తర్వాత ఆమె ఆనందాన్ని కూడా చూడండి.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
వీడియో లో కనిపిస్తున్న అమ్మాయి హైదరాబాద్ కి చెందినది. ఈమెతో పాటు ఉన్న వ్యక్తి అన్నయ్య. సాధారణంగా ఇలాంటివి ఎవరైనా వీడియో తీస్తే కోప్పడుతారు. కానీ ఆయన మాత్రం సినిమా థియేటర్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి, పూర్తి అయ్యే వరకు వీడియో తీసుకునేందుకు అనుమతిని ఇచ్చాడు. ఇతను హైదరాబాద్ లో ప్రముఖ IT కంపెనీ లో పనిచేస్తున్నాడు. ఆయన సోదరి కూడా మంచిగానే చదువుకుంది, ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానిగా పెరిగింది. ఈ సినిమాకి మాత్రమే కాదు, ప్రతీ సినిమాకు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఏర్పడిన ఆమె ఎట్టిపరిస్థితిలోనూ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ లో చూడాల్సిందేనట. ఆమెతో పాటు వచ్చిన అన్నయ్య కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. అలా ఒక్కసారిగా వీళ్లిద్దరు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ అయిపోయారు.
ఇకపోతే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి ఓపెనింగ్స్ వరకు చాలా భారీగానే వచ్చినప్పటికీ, రెండవ రోజు భారీ నుండి అతి భారీగా వసూళ్లు తగ్గిపోయాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడితే, రెండవ రోజు కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎంత దారుణమైన డ్రాప్స్ అనేది మీరే చూడండి. కానీ మూడవ రోజు వసూళ్లు కాస్త పుంజుకున్నాయి. ఇక నాల్గవ రోజు అయితే ప్రతీ సెంటర్ లోనూ దంచి కొట్టేసింది. కానీ అది పవన్ కళ్యాణ్ రేంజ్ కాకపోయినా, అతి దారుణమైన వసూళ్ల నుండి, అద్భుతమైన వసూళ్లు వచ్చాయి అనే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వాళ్ళ నుండి కూడా అనిపించుకుంది ఈ చిత్రం. వసూళ్లు ఎంత వచ్చాయి అనేది కాసేపు పక్కన పెడితే నిర్మాత AM రత్నం కి నిన్న కాస్త ఊపిరి తీసుకునే అవకాశం కలిగింది.
ఈ సినిమాకు వసూళ్లు పెరగడానికి ముఖ్య కారణం, సినిమాలో అత్యంత ట్రోలింగ్ కి గురి కాబడిన VFX సన్నివేశాలను తొలగించడం వల్లే. ఉదాహరణకు జెండా ని పాతే సన్నివేశం, గుర్రపు స్వారీ సన్నివేశం, బాణం వేసే సన్నివేశం, క్లైమాక్స్ లో సుడిగుండాలు సన్నివేశాన్ని సినిమా నుండి ఎత్తివేశారు. దీంతో చూసే ఆడియన్స్ కి ఇప్పుడు కాస్త పర్వాలేదు అనే రేంజ్ లో అనిపించింది. ఇప్పటికీ సెకండ్ హాఫ్ లో అనేక VFX సన్నివేశాలు చెత్తగానే ఉన్నాయి కానీ, మొదటి కాపీ తో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి ఆదివారం రోజు భారీగా పెరిగిన ‘హరి హర వీరమల్లు’ వసూళ్లు, అదే జోరుని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుందా, లేకపోతే తగ్గిపోతుందా అనేది చూడాలి.
He carried his sister in a wheelchair just to watch #HHVM and see @PawanKalyan on the big screen…
This is not just fandom, it’s pure love and emotion— Bobby (@sekhar_ybsr) July 27, 2025