Homeఆంధ్రప్రదేశ్‌Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ బాట.. ఏంటి కథ?

Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ బాట.. ఏంటి కథ?

Jagan Delhi Tour: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టనున్నారా? ఏపీలో వైసిపి నేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను వర్ణించనున్నారా? అయితే ఆయన ఎవరిని కలుస్తారు? ఏ పార్టీ నేతలు ఆయనతో కలిసి వస్తారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకేనని టాక్ వినిపిస్తోంది. అయితే అదే సమయంలో ఇతర పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతారని కూడా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డితో కలిసి వచ్చేది ఎవరు? మద్దతు ఇచ్చేది ఎవరు? అనేది ఇప్పుడు బలమైన చర్చ.

Also Read: గెలుపు తనదని ఇంగ్లాండ్ అనుకుంది.. అదే మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పింది!

* బిజెపి పెద్దలు సైతం
ప్రస్తుతం ఎన్డీఏలో( National democratic Alliance) తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. అదే సమయంలో ఏపీలో టీడీపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది బిజెపి. బిజెపి నుంచి టీడీపీకి అన్ని విధాలా సహకారం అందుతోంది. ఇటువంటి సమయంలో బిజెపి పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అభయం ఇస్తారా? కనీసం కలిసేందుకు అవకాశం ఇస్తారా? అన్నది అనుమానమే. ఇప్పటికే కొంతమంది బిజెపి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి చూపిస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు అవకాశం దక్కినా అది సంచలనమే.

* ఇండియా కూటమి నో ఛాన్స్
ఇండియా కూటమి పట్ల జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సుముఖంగా లేరు. కానీ అదే కూటమిలో కొనసాగుతున్న కొన్ని పార్టీలతో మాత్రం ఆయన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. మరికొన్ని పార్టీల నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. అయితే అప్పట్లో విజయసాయిరెడ్డి రూపంలో జాతీయ పార్టీ నేతలతో లాబీయింగ్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. మరోవైపు జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో జగన్మోహన్ రెడ్డి కలిసి నడిచిన దాఖలాలు లేవు. ఇప్పటికే మద్యం కుంభకోణం విషయంలో సంచలన ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఇందులో హస్తము ఉందని కూడా ఆరోపించింది. దీంతో ఆ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు కొన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్ర పెద్దలను భయపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరు మద్దతిచ్చే అవకాశం లేదని జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

* బెంగళూరులో మంత్రంగం..
ప్రస్తుతం మద్యం కుంభకోణం( liquor scam) కేసు పై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీని నుంచి ఎలా బయటపడాలి అనే దానిపై ఫుల్ ఫోకస్ చేశారు. జాతీయస్థాయిలో లాబీయింగ్ చేస్తే కానీ బయటపడలేమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జాతీయస్థాయిలో పోరాటం చేస్తే సానుభూతి లభిస్తుందన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే తాడేపల్లి కి రాకుండా.. బెంగళూరు ప్యాలెస్ లో వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular