Rajamouli Secret In Farmhouse: రాజమౌళికి హైదరాబాద్ శివారులో ఓ ఫార్మ్ హౌస్ ఉంది. అందులో ఎవరికీ తెలియకుండా ఆయన రహస్యంగా ఏదో చేస్తున్నాడన్న న్యూస్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం…
రాజమౌళి(RAJAMOULI) తాను చేసే ప్రాజెక్ట్ జానర్ తో పాటు, సినిమా ఎలా ఉంటుంది అనే విషయాలు సూచాయగా హింట్ ఇస్తాడు. ఒక్కసారి సినిమా సెట్స్ మీదకు వెళ్ళాక ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. సెట్స్ నుండి ఫోటోలు, వీడియోలు, హీరోల లుక్స్ లీక్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటారు. రాజమౌళి సెట్స్ లోకి మొబైల్స్ కూడా అనుమతించడని సమాచారం. అవుట్ డోర్ లో షూటింగ్ లో మాత్రం ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫోటోలు, వీడియోలు లీక్ అవుతాయి.
Also Read: బాలయ్య బాబు అఖండ 2 రిలీజ్ పై ఎందుకంత సస్పెన్స్.. ఏం జరిగింది..?
SSMB 29 విషయంలో మరింత పకడ్బందీగా ముందుకు వెళుతున్నారు రాజమౌళి. సాధారణంగా సినిమా సెట్స్ మీదకు వెళ్లబోయే ముందు రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈసారి ఆయన మీడియా ముందుకు రాలేదు. చివరికి పూజా సెరిమోని కూడా రహస్యంగా మీడియాకు అనుమతి లేకుండా నిర్వహించారు. హైదరాబాద్ శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత షూటింగ్ జరిగింది. ఒరిస్సా ఫారెస్ట్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.
SSMB 29 షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు(MAHESH BABU) శ్రీలంక టూర్ కి వెళ్లారు. కూతురు సితార జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు అక్కడ జరుపుకున్నారు. ఈ గ్యాప్ లో రాజమౌళి తన ఫార్మ్ హౌస్ లో పాటల రికార్డింగ్ చేస్తున్నారట. రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి SSMB 29 పాటల రికార్డింగ్ స్టార్ట్ చేశాడట. రాజమౌళి ఫార్మ్ హౌస్లో పాటల రికార్డింగ్ జరుగుతుండగా.. అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయట. దాదాపు 100 మంది స్టంట్ మెన్ ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారని సమాచారం.
Also Read: క్రిష్ కి హరిహర వీరమల్లు మూవీ కోసం ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా..?
సినిమాను ఒక యజ్ఞంలా భావించే రాజమౌళి బెటర్ అవుట్ ఫుట్ కోసం చాలా కష్టపడతారు. అందుకే ఆయన అపజయం లేని దర్శకుడిగా రికార్డులకు ఎక్కారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో SSMB 29 నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.