https://oktelugu.com/

పవర్ స్టార్ ఈ నెల 24 నుండి.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ చేయబోతున్నాడని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్రివిక్రమ్ పర్యవేక్షణలో తయారయ్యే ఈ సినిమా 22న నుంచి సెట్ మీదకు వస్తుంది. 24 లేదా 25న పవన్ కళ్యాణ్ సెట్ మీదకు వస్తారు. ఇక ఈ సినిమాలో పవన్ భార్యగా సాయి పల్లవిని, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ ను, రానా తండ్రిగా సుముద్రఖని, ఇతర క్యారెక్టర్లలో బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లను […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 10:34 AM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ చేయబోతున్నాడని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్రివిక్రమ్ పర్యవేక్షణలో తయారయ్యే ఈ సినిమా 22న నుంచి సెట్ మీదకు వస్తుంది. 24 లేదా 25న పవన్ కళ్యాణ్ సెట్ మీదకు వస్తారు. ఇక ఈ సినిమాలో పవన్ భార్యగా సాయి పల్లవిని, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ ను, రానా తండ్రిగా సుముద్రఖని, ఇతర క్యారెక్టర్లలో బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.

    Also Read: రోజు పొద్దున్నే భర్తతో అలా చేస్తానంటున్న కాజల్

    పైగా ఇప్పటికే నటీనటులు అందరికీ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారట. ముందుగా హైదరాబాద్ లో మొదటి షెడ్యూలు పూర్తి చేస్తారట. ఆ తరువాత పోలాచ్చిలో ఒక లెంగ్తీ షెడ్యూలులో సినిమా మొత్తాన్ని ఫినిష్ చేస్తారని.. అన్నట్టు త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్ లో ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పైగా త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

    Also Read: ఆ వీరుడి కథతో మహేష్ బాబు.. రాజమౌళి సినిమా

    ఇక సాగర్ డైరక్షన్ లో ఈ రీమేక్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు రానా కీ రోల్ చేస్తున్నాడు. పవన్, రానాల కాంబినేషన్ అంటే పెద్ద దర్శకుడే ఉండాలి. కానీ, పెద్ద దర్శకుడు దొరకలేదు. అందుకే త్రివిక్రమ్ ను పెద్ద దిక్కుగా పెట్టుకున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్