https://oktelugu.com/

ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్: భారత్ ను ఊరిస్తున్న విజయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత్ ను విజయం ఊరిస్తోంది. గెలుపు ముంగిట నిలుచుకుంది. భారత్ నిలబడుతుందా? పడిపోతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. Also Read: 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు లక్కీ ఛాన్స్? ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో భారత్ జట్టు గట్టిగా పోరాడుతోంది. పూజారా 43 పరుగులతో ఓవైపు నిలబడ్డాడు. మరోవైపు గిల్, రహానే, రోహిత్ ఔట్ కావడంతో రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం 10 పరుగులతో ఆడుతున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 / 10:31 AM IST
    Follow us on

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత్ ను విజయం ఊరిస్తోంది. గెలుపు ముంగిట నిలుచుకుంది. భారత్ నిలబడుతుందా? పడిపోతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

    Also Read: 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు లక్కీ ఛాన్స్?

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో భారత్ జట్టు గట్టిగా పోరాడుతోంది. పూజారా 43 పరుగులతో ఓవైపు నిలబడ్డాడు. మరోవైపు గిల్, రహానే, రోహిత్ ఔట్ కావడంతో రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం 10 పరుగులతో ఆడుతున్నాడు.

    వీరిద్దరూ గత 3వ టెస్టులోనూ విజయం అంచుల వరకు తీసుకొచ్చారు. వీరి ప్రయత్నం ఈరోజు కూడా ఫలిస్తే భారత్ విజయం సాధించడం ఖాయం.

    Also Read: 4వ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

    ఇంకా 37 ఓటర్ల ఆట మిగిలి ఉంది. ఇంకా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. భారత్ గెలుపు కోసం 145 పరుగులు కావాలి. ఈ నేపథ్యంలో భారత్ గెలుస్తుందా? లేదా డ్రా చేస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

    పరిస్థితి చూస్తుంటే భారత్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయి. అయితే పంత్ ధాటిగా ఆడితే గెలుపు ఖాయం. ఏం జరుగుతుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. భారత్ కనుక లక్ష్యం సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు చెంపపెట్టులాంటిదే అవుతుంది. వారికి గర్వభంగం అవుతుంది.