Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలై వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం అభిమానుల ఆకలి మొత్తాన్ని తీర్చింది. కంటెంట్ పరంగా మాత్రమే కాదు, గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ నుండి మిస్ అవుతున్న భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, రికార్డ్స్ వగైరా వంటివి ఈ చిత్రం చూస్తున్నారు అభిమానులు. ఇది కదరా పవర్ స్టార్ రేంజ్ అనే విధంగా బాక్స్ ఆఫీస్ వసూళ్లను రాబట్టి మొదటి వారం లో 265 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా మేకర్స్ నిన్న హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ లో ఆ నూతనోత్సాహం చూసి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం జీవితం లో ఎప్పుడూ చెయ్యని పనులను చేయించారు నాతో సుజిత్, థమన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజీ గెటప్ లో రావాలని అన్నారు, సరే అని వచ్చాను. ఇక్కడ సక్సెస్ సెలబ్రేషన్స్ లోకి అడుగుపెట్టే ముందు నన్ను స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకోవాలని అని అన్నారు. చంపేస్తానని చెప్పాను. కానీ ఈ కుర్రాళ్లిద్దరి ఉత్సాహం,ప్రేమ చూసి ఏది చెప్పినా చేస్తూ వచ్చాను. ఇలాంటి టెక్నీషియన్స్ తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థమన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేసాడు. చిన్న తనం లోనే తండ్రిని కోల్పోయిన వ్యక్తి, ఇంటికి పెద్ద దిక్కు గా ఉంటూ వచ్చాడు, నేడు ఈ చిత్రానికి ఆయన పనితనం ద్వారా తన తండ్రికి నివాళి ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ ‘సుజిత్ ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఈ సినిమాకు జానీ రిఫరెన్స్ ఉపయోగిస్తున్నాను అని చెప్తే, అసలే అది ఫ్లాప్ సినిమా, దానిని ఎందుకు?, మళ్లీ ఏమైనా తేడా జరిగితే నా ఫ్యాన్స్ మా మీదకు ఎక్కేస్తారు అని భయపడ్డాను. కానీ అతని టేకింగ్ కి ఫ్యాన్ అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సోషల్ మీడియా లో జరిగే ఫ్యాన్ వార్స్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘దయచేసి ఫ్యాన్ వార్స్ ఆపేయండి. నా అభిమానులకు కూడా ప్రత్యేకించి చెప్తున్నాను. ఒక హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలి అనే రేంజ్ లో మనం ఆలోచిస్తున్నామంటే, మన మనసు కరెక్ట్ గా లేదని అర్థం. సినిమా మీద ఎన్నో వందల కుటుంబాలు ఆధారపడుంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.