Pawan Kalyan : కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్స్ దాకా వచ్చి ఆగిపోయినవి చాలానే ఉన్నాయి. అప్పట్లో ఈ కాంబినేషన్స్ మిస్ అయ్యాయి అనే విషయం మనకి తెలిసి ఉండదు. కానీ కొన్నేళ్ల తర్వాత సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ తెలిసినప్పుడు, అవునా?, ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ ని మా అభిమాన హీరో మిస్ అయ్యాడా అని అభిమానులు బాధపడుతుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎదురు అయ్యి ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన వదిలేసిన సినిమాలను వేరే హీరోలు చేసి భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా మిస్ అయిన అద్భుతమైన కాంబినేషన్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అక్కినేని నాగేశ్వర రావు(ANR) కలయిక.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ టీజర్ గురించి సెన్సేషనల్ అప్డేట్!
పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం లో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సాదించాలి అని ఆరాటపడుతున్న రోజుల్లో ‘సుస్వాగతం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా 5 బ్లాక్ బస్టర్స్ ని అందుకొని యూత్ ఐకాన్ గా మారిపోయాడు. అయితే సుస్వాగతం చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎంత అద్భుతంగా నటించాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఆయన నటన ని చూసి కన్నీళ్లు పెట్టుకోని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. పవన్ కళ్యాణ్ ని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ సినిమాలో పవన్ నటనని ద్వేషించలేరు. అంత అద్భుతమైన క్యారక్టర్ చేశాడు. అప్పటి వరకు సౌత్ ఇండియా లో అనేక విలన్ రోల్స్ చేస్తూ మంచి పాపులారిటీ ని సంపాదించిన రఘువరన్, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా పాజిటివ్ రోల్ లో కనిపించాడు.
ఆయన నటన కూడా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. అయితే ఈ క్యారక్టర్ కోసం రఘువరన్ కంటే ముందుగా సీనియర్ హీరో శోభన్ బాబు ని సంప్రదించారట. అప్పటికే సినిమాల్లో నటించకూడదు అని నిర్ణయం తీసుకున్న శోభన్ బాబు, ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసాడట. ఇక ఆ తర్వాత అక్కినేని నాగేశ్వర రావు ని సంప్రదించారట. ఆయన నటించడానికి ఓకే చెప్పాడట కానీ,క్లైమాక్స్ లో చనిపోయే సన్నివేశం ఉంటుంది కాబట్టి అక్కినేని అభిమానులు ఎలా తీసుకుంటారో అని, కొడుకు నాగార్జున సలహా మేరకు క్లైమాక్స్ ని మారిస్తే చేస్తానని చెప్పాడట నాగేశ్వర రావు గారు. కానీ సినిమాకు ప్రాణమే ఆ ఎమోషనల్ క్లైమాక్స్ అవ్వడంతో డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు అందుకు ఒప్పుకోలేదు.ఇక చివరికి పవన్ సలహా మేరకు రఘువరన్ ని ఎంచుకున్నారు.