Jasprit Bumrah: సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు బౌలర్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి.. కీలకమైన ఇద్దరు ఆటగాళ్లను రన్ అవుట్ చేశాడు. ఫలితంగా సూపర్ ఓవర్ లో ఆరు బంతులను పూర్తిస్థాయిలో ఆడకుండానే రాజస్థాన్ జట్టు చేతులెత్తేసింది. ఐదు బంతులు ఎదుర్కొని 11 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవానికి సూపర్ ఓవర్లో 11 పరుగులు స్వల్ప లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 4 బంతుల్లోనే క్లోజ్ చేసింది. తద్వారా ఓటమి తప్పదు అనుకునే మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలపరుచుకుంది. ఢిల్లీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్టాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. అంతకుముందు 18, 20 ఓవర్ అత్యద్భుతంగా వేసిన స్టార్క్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో అతడి గురించే చర్చ జరుగుతుంది.
Also Read: లక్ష కోట్ల ఐపీఎల్..ఇంత క్రేజ్ ఏంట్రా బాబూ
ట్రెండింగ్లోకి బుమ్రా వచ్చేసాడు
సూపర్ ఓవర్ లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీ జట్టు బౌలర్ స్టార్క్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయాడు. అతడి గురించే నిన్న రాత్రి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు చర్చ జరుగుతోంది. ఇక ఈ జాబితాలో ఇప్పుడు బుమ్రా వచ్చేసాడు.. గతంలో ఐపీఎల్లో ముంబై జట్టు, గుజరాత్ లయన్స్ జట్లు తలపడ్డాయి. అప్పుడు మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. నాటి మ్యాచ్లో ముంబై జట్టు బౌలర్ బుమ్రా సూపర్ పవర్ వేశాడు. ఒక నో బాల్, వైడ్ కూడా విసిరి 12 పరుగుల స్కోరును గుజరాత్ ఆటగాళ్లు కొట్టకుండా నిలువరించాడు.. మెక్ కల్లం, ఫించ్ వంటి హార్డ్ హిట్టర్లకు తన బంతులతో చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లు కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. వైడ్, నో బాల్ విసిరినప్పటికీ.. ఆరు పరుగులు ఇవ్వడం బుమ్రా బౌలింగ్ తీరుకు అద్దం పట్టింది. ” అతడు వైడు వేశాడు. నోబాల్ కూడా వేశాడు. మెక్ కల్లమ్, ఫించ్ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయినప్పటికీ బుమ్రా ఏమాత్రం భయపడలేదు. తనకు మాత్రమే సొంతమైన యార్కర్లతో వారిద్దరికీ చుక్కలు చూపించాడు. మొత్తంగా నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. వైడ్, నో బాల్ వల్ల మొత్తంగా ఆరు పరుగులు వచ్చాయి. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ముంబై జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ లో ఈ మ్యాచ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడున్నట్టు గనుక అప్పుడు సోషల్ మీడియా వ్యాప్తి ఎక్కువగా ఉండి ఉంటే.. బుమ్రా పేరు మరింతగా మారుమోగిపోయేదని” క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: రోహిత్ ని చూసి స్ఫూర్తి పొందాను.. నేర్చుకున్నాను: ట్రావిస్ హెడ్