RBI: ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రొఫెషనల్ ఇలా చాలామందికి ఒకటి కాదు రెండు కాదు ఎక్కువ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉండడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. బ్యాంకులో డబ్బును ఉంచుకోవడం చాలా సురక్షితం అంటూ చాలామంది భావిస్తారు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆ లిమిట్ ను దాటినట్లయితే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకులో డబ్బులు లిమిట్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. వాటిని ఉల్లంఘించినట్లయితే మీకు పెనాల్టీలు తప్పవు. అలాగే ఆదాయపు పన్ను శాఖ నుంచి కూడా మీరు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఉండవచ్చు.
Also Read: రాజస్థాన్ పై ఢిల్లీ “సూపర్” విక్టరీ.. ట్రెండింగ్ లో బుమ్రా
ఒకవేళ మీ అకౌంట్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు ఐటీ శాఖకు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇవ్వాలి. అన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటన్ కింద దీనిని నమోదు చేయాలి. దీనికి మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ దీని గురించి మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్లో ఉన్నవాళ్లకు ఈ పరిమితి ఎక్కువగా ఉంటుంది. కరెంట్ అకౌంట్ లో వాళ్లు రూ.50 లక్షల వరకు పెట్టుకోవచ్చు. కానీ ఇది కూడా సరైన ఆధారాలతో డబ్బును ఎకౌంట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే ఐటీ శాఖ విచారణ చేపడుతుంది. కొన్ని సందర్భాలలో బ్యాంకులో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తున్న సమయంలో పాన్ కార్డు కూడా అవసరం అవుతుంది.
ముఖ్యంగా ఒక వ్యక్తి రూ.50 వేలకు పైగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనుకుంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఎడాదిలో బ్యాంకు పరిమితికి నుంచి మొత్తం ట్రాన్సాక్షన్ లో ఉంటే దానికి కూడా పాన్ కార్డు అవసరం ఉంటుంది. వీటికి పన్ను చెల్లించాలి. వీటి ట్రాన్సాక్షన్ లో ఐటీ శాఖకు కనిపించేలా ఉండాలి. పెద్ద మొత్తంలో మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బును డిపాజిట్ చేస్తున్న సమయంలో ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది మరియు ఎందుకు డిపాజిట్ చేశారు అనే పూర్తి వివరాలను బ్యాంక్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.