https://oktelugu.com/

వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” నుండి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటి వరకు లాయర్‌గానే దర్శనమిచ్చిన పవర్ స్టార్.. ఫస్ట్ టైమ్ హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ‘పింక్’ సినిమాలో హీరో పాత్రకు జోడీ లేకపోయినా.. తెలుగులో మాత్రం పవన్ కి హీరోయిన్ ను పెట్టారు. ఇక ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ ను బాగానే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2021 / 01:41 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” నుండి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటి వరకు లాయర్‌గానే దర్శనమిచ్చిన పవర్ స్టార్.. ఫస్ట్ టైమ్ హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ‘పింక్’ సినిమాలో హీరో పాత్రకు జోడీ లేకపోయినా.. తెలుగులో మాత్రం పవన్ కి హీరోయిన్ ను పెట్టారు. ఇక ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. కాగా రాబోయే సంక్రాంతికి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

    Also Read: పూరి జగన్నాథ్ బెస్ట్ ఇయర్ 2020నేనట తెలుసా?

    అన్నట్టు నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కల్యాణ్.. ‘ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ పుణ్యం క్షీణిస్తుంది.. ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ స్వార్థం జయిస్తుంది’ అంటూ శ్రీ రాంధారి సింగ్ కవితలోని లైన్లను పోస్ట్ చేసిన ఆయన.. ‘ఈ కొత్త సంవత్సరం, మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ, అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ ను పోస్ట్ చేశారు. ఇక వకీల్ సాబ్ మరో వారం రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది.

    Also Read: ట్రైలర్ టాక్: ‘క్రాక్’ పుట్టించిన రవితేజ

    అయితే రేపటి నుండి షూట్ మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని వరుస డేట్స్ ను పవన్ కేటాయించాడని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం వేసిన ప్రత్యేక భారీ కోర్టు సెట్ లో ఈ వారం రోజుల పాటు షూ ట్ జరుపుతారట. అనంతరం ఈ సినిమా పూర్తి అవుతుంది. ఆ తరువాత వెంటనే క్రిష్ తో చేస్తోన్న సినిమాను కూడా మొదలుపెడతాడట పవన్. పైగా క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.