తెరాస దోపిడీ కొనసాగుతోంది: బండి సంజయ్‌

తెలంగాణ భాజపా నేతలు శుక్రవారం గవర్నర్‌ తమిళిసైని కలిసి జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ…”జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభివృద్ది కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదు. వారు చెప్పిన సమస్యలు పరిష్కరించడంలేదు. తెరాస కార్పొరేటర్లు అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి దోపిడీ ప్రణాళిక పూర్తయ్యే వరకు కొత్త పాలక వర్గాన్ని అనుమతించకూడదని […]

Written By: Suresh, Updated On : January 1, 2021 1:41 pm

bandi sanjay

Follow us on

తెలంగాణ భాజపా నేతలు శుక్రవారం గవర్నర్‌ తమిళిసైని కలిసి జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ…”జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభివృద్ది కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదు. వారు చెప్పిన సమస్యలు పరిష్కరించడంలేదు. తెరాస కార్పొరేటర్లు అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి దోపిడీ ప్రణాళిక పూర్తయ్యే వరకు కొత్త పాలక వర్గాన్ని అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు” అని బండి సంజయ్‌ ఆరోపించారు.